ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆహారం దొరకడం అనేది చాలా కష్టంగా మారిందనే చెప్పొచ్చు. ఏది ఎలా కల్తీ చేస్తున్నారో కూడా కనీసం తెలియడం లేదు. ఆర్గానిక్ ఫుడ్స్ అని రేటు ఎక్కువ పెట్టి కొన్నా కూడా.. ఫలితం ఉండటం లేదు. ఏది ఒరిజనలో, ఏది కల్తీనో చెప్పడం మరింత కష్టంగా ఉంటుంది. వంట నూనెలో కూడా కల్తీ జరుగుతూ ఉంటుంది. మనం ప్యాకెట్ లో కొన్నా, డబ్బాలో కొన్నా... నూనెలో కల్తీ మాత్రం జరగే అవకాశం మాత్రం చాలా ఎక్కువ.