అన్నం తిన్నా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?

First Published | Sep 26, 2024, 12:58 PM IST

బరువు తగ్గాలి అనుకునేవాళ్లు.. అన్నం వదులుకోకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
 

white rice

ఈరోజుల్లో బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుూనే ఉంటారు. అయితే... బరువు తగ్గాలి అంటే... అన్నం తినడం మానేయాలి అని చాలా మంది నమ్మే నిజం. అన్నం తింటే బరువు తగ్గరు అని నమ్ముతుంటారు. కష్టంగా అనిపించినా కూడా...  అన్నం మానేసి అతి కష్టంగా బరువు తగ్గుతారు. మళ్లీ కొద్ది రోజులకు కంట్రోల్ తప్పి.. మళ్లీ అన్నం తినేస్తారు. ఫలితం మళ్లీ బరువు తగ్గుతారు. కానీ... మనం రెగ్యులర్ గా అన్నం తిన్నా కూడా.. ఈజీగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. అది కూడా వైట్ రైస్ తిని కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

నిజానికి, అన్నం తింటేనే బరువు పెరుగుతారు అని చెప్పలేం. అది అన్నం తినే పద్దతి, వాళ్ల  శరీరాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అందుకే.. అందరూ అన్నం తింటే బరువు పెరిపోతారు అని చెప్పలేం. మన వాతావరణానికి మన శరీరాలకు అన్నమే సూట్ అవుతుంది. కాబట్టి... రోజుకు రెండుసార్లు అన్నం తినడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ కొందరి శరీరంలో ఫ్యాట్ లాగా పెరిగిపోతుంది. అది కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అలా జరుగుతుంది. అందుకే.... బరువు తగ్గాలి అనుకునేవాళ్లు.. అన్నం వదులుకోకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos



అన్నం తినడానికి సరైన మార్గం ఏమిటి?
మీరు మీ బరువు తగ్గించే ప్రణాళికతో రాజీ పడకుండా అన్నం తినాలనుకుంటే, రైస్‌ని ఆవిరి మీద ఉడికించి లేదా ఉడకబెట్టి తినండి. అన్నం తినడానికి ఇదే సరైన మార్గం.అన్నాన్ని వేయించి తినడం లేదా నెయ్యి లేదా నూనె వంటి కొవ్వును జోడించడం మానుకోండి. పోర్షన్ కంట్రోల్ పై కూడా శ్రద్ధ పెట్టాలి. అంటే.. ఎక్కువెక్కువ కాకుండా.. మితంగా తినాలి.
 

దీనితో పాటు, అన్నం తినడానికి సరైన సమయాన్ని ఎంచుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ లంచ్ లేదా డిన్నర్‌లో అన్నాన్ని చేర్చుకోవాలి.
మీరు అన్నం తిన్నప్పుడల్లా, సమతుల్య భోజనంగా తినండి. మీ ప్లేట్‌లో సగం భాగం అన్నం, 1 భాగం పప్పు  1 భాగం కూరగాయలు ఉండాలి.
మీరు ఖిచ్డీ రూపంలో మీ ఆహారంలో బియ్యాన్ని చేర్చుకోవచ్చు. ఇది కూరగాయలు  కాయధాన్యాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది, ఇది పూర్తి ప్రోటీన్ మూలం, ఇది బరువు తగ్గడంలో కూడా మీకు సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి నేను అన్నం మానుకోవాలా?
ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్లూటెన్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ అని నిపుణులు చెబుతున్నారు. అంటే, దానిని సరైన పరిమాణంలో , సరైన పద్ధతిలో వినియోగించినట్లయితే, అది బరువు , జీవనశైలి రెండింటినీ నిర్వహించగలదు. కాబట్టి.. అన్నం తినే విషయంలో ఎలాంటి భయం పెట్టుకోకండి.. అన్నంతో పాటు.. సలాడ్స్, పప్పు, చికెన్, కూరగాయలు.. వీటి భాగం పెంచుకుంటే... బరువు పెరుగుతామనే భయం ఉండదు. ఇంకా చెప్పాలంటే.. హెల్దీగా బరువు కూడా తగ్గొచ్చు.

click me!