పాలకూరలో పోషకాలు..
పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 100గ్రాముల పాలకూరలో 23 కేలరీలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు 91 శాతం నీరు, 2.9 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.4 గ్రాముల చక్కెర, 2.23 గ్రాముల ఫైబర్, .4 గ్రాముల ఫ్యాట్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.
పాలకూరలో కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన విటమిన్ సి పాలకూరలో ఉంటుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గాయాల నుండి వెలువడే రక్తాన్ని గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ కె1 పాలకూరలో ఉంటుంది. గర్భిణులకు అవసరమైన పోషకం అయిన ఫోలేట్ లేదా విటమిన్ బి9 పాలక్ లో ఉంటుంది. ఇది కణజాల పెరుగుదలకు చాలా అవసరం.