టీ ఇలా తాగినా కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు..!

First Published | Sep 26, 2024, 10:31 AM IST

సాధారణంగా పాలల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు రోజుకి రెండు, మూడు సార్లు టీ తాగితే... కేలరీలు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

బరువు తగ్గడానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. బరువు తగ్గాలి అంటే... మనకు నచ్చినవి చాలా వదులుకోవాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా వదులుకోవాలి అని అందరూ చెప్పేవాటిలో టీ కూడా ఉంటుంది. టీలో పాలు, పంచదార వేస్తాం కాబట్టి..  బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వవు అనుకుంటూ ఉంటారు. కానీ... మీరు  టీని వదిలేయకుండా.. టీ తాగుతూ కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

milk tea

టీ ఎలా తాగితే బరువు తగ్గుతారంటే...
సాధారణంగా పాలల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు రోజుకి రెండు, మూడు సార్లు టీ తాగితే... కేలరీలు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే.. చాలా మంది డైటీషియన్లు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టీ తాగవద్దని సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే.. చాలా మంది టీ తాగడమే కాకుండా.. దానితోపాటు కొన్ని స్నాక్స్ కూడా తింటూ ఉంటారు. ఫలితంగా బరువు పెరుగుతారు.


milk tea

నిజానికి ఒక కప్పు పాలు మీ బరువు పెంచవు. కానీ... దానితో  వేయించినవి తినకుండా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలి. ఇలా స్పెషల్ గా టీ సిద్ధం చేసుకుంటే. బరువు తగ్గే సమయంలో రోజుకు ఒక్కసారే టీ తాగాలి. దానితో ఖఖ్రా, మఖానా, కాల్చిన భేల్ లేదా కాల్చిన పప్పు తినండి.

టీ తయారు చేసే సమయంలో తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు...
చక్కెర లేకుండా టీ త్రాగాలి.
స్టెవియా లేదా కొద్దిగా బెల్లం వంటి సహజ స్వీటెనర్ జోడించండి.
స్కిమ్డ్ మిల్క్‌తో టీ చేయండి.
పాలు , నీటి నిష్పత్తి సమానంగా ఉంచండి.
టీలో లవంగాలు, ఏలకులు  అల్లం జోడించండి.
టీతో పాటు వేయించిన అల్పాహారం తినవద్దు.
ఖాళీ కడుపుతో టీ తాగవద్దు.
ఆహారంతో పాటు టీ తాగకూడదు.
రోజుకు ఒకసారి మాత్రమే టీ త్రాగాలి.
మీకు ఉదయం అల్పాహారంతో పాటు టీ తాగే అలవాటు ఉంటే, అల్పాహారానికి ఒక గంట ముందు లేదా ఒక గంట తర్వాత త్రాగండి.

Latest Videos

click me!