ఆయుర్వేదం ప్రకారం.. మామిడి పండ్లను ఎలా తినాలో తెలుసా?

First Published Apr 16, 2024, 6:54 AM IST

ఆయుర్వేదం ప్రకారం .. మామిడి పండ్లను ఎలా పడితే అలా తినకూడదు. ఒకవేళ తింటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో పోషకాలున్న మామిడి పండును ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Mango

ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి.. ఈ సీజన్ మొత్తం మామిడి పండ్లను బాగా తింటుంటారు. అయితే ఈ పండు తింటే కడుపునొప్పి, ముఖంపై మొటిమలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. నిజానికి కొంతమందికి జరుగుతుంది కూడా. కానీ మామిడి తిన్న తర్వాత అలాంటి సమస్యలు రావడానికి మీరు చేసే కొన్ని తప్పులే కారణమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసలు మామిడి పండ్లను ఆయుర్వేదం ప్రకారం.. ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

మామిడి పండ్లను ఎలా తినాలి

ఎవ్వరైనా సరే మామిడి పండ్లను తినడానికి ముందు కనీసం 1 నుంచి 2 గంటల పాటు నీళ్లల్లో నానబెట్టాలి. వాటిని అంతసేపు నానబెట్టే టైం లేకపోతే 25-30 నిమిషాల పాటైనా నానబెట్టి తినడం మంచిది.
 

మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి?

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను నానబెట్టే తినాలి. ఎందుకంటే వీటిని నీళ్లల్లో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మామిడి పండ్లను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల వాటి పోషకాలు బాగా శోషించబడతాయి. మామిడి పండ్లను నానబెట్టి తింటే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. చర్మ సమస్యలు రావు. అలాగే తలనొప్పి, మలబద్ధకం, గట్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు. 

ఫైటిక్ ఆమ్లం అంటే ఏంటి?

ఫైటిక్ ఆమ్లం అనేది యాంటీ-న్యూట్రియంట్. ఇది ఇనుము, జింక్, కాల్షియం, ఇతర ఖనిజాలు వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది ఖనిజ లోపాలకు దారితీస్తుంది. అదనపు ఫైటిక్ ఆమ్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.

మామిడి పండును తనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆయుర్వేదం పాలు, పండ్లను వేర్వేరుగా తినాలి. ఎందుకంటే ఇది మనకు ఎన్నో శారీరక సమస్యలను కలిగిస్తుంది. మామిడి, అవొకాడో, ఖర్జూరం వంటి నేచురల్ తీయని పండ్లు, పండిన పండ్లతో మాత్రమే పాలలో కలపాలని నిపుణులు చెబుతున్నారు.

పాలలో మామిడి పండ్లను వేసుకుని తినడం వల్ల వాత, పిత్తం శాంతపడుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ తీయగా ఉంటుంది. చల్లగా కూడా ఉంటుంది.  మ్యాంగో షేక్స్ లో మామిడి పండ్లను ఆస్వాదించొచ్చు. .

click me!