త్వరగా బరువు తగ్గడానికి ఏం బ్రేక్ ఫాస్ట్ తినాలి?

First Published Apr 14, 2024, 6:49 AM IST

బరువు తగ్గాలని చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తుంటారు. కానీ ఇది తప్పు. దీనివల్ల మీరు బరువు తగ్గే ఛాన్సే లేదు. బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తే మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. త్వరగా బరువు తగ్గాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాల్సిందే. అయితే కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు మీరు త్వరగా బరువు తగ్గడానికి  సహాయపడతాయి. అవేంటంటే? 
 

లావుగా ఉన్న ఆడవారు ఎలాగైనా సరే బరువు తగ్గాలని చూస్తారు. ఇందుకోసం ప్రయత్నిస్తారు. బరువు తగ్గడానికి జిమ్ కు వెళ్లడం, డైటింగ్ చేయడం పెద్ద సవాలే. అయితే బరువు తగ్గాలనుకునే వారు ముందుగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గుతామని బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం చేయకూడదు. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తే మీరు మధ్యాహ్నం హెవీగా తిని మరింత బరువు పెరిగే అవకాశం ఉంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీరు మరింత శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అలాగని అతిగా మాత్రం తినకూడదు. మీరు తినే బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండాలి. అలాగే కార్బోహైడ్రేట్ లేని ఆహారాన్ని తీసుకోకూడదు. బరువు తగ్గడానికి సహాయపడే బ్రేక్ ఫాస్ట్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

egg

గుడ్డు

గుడ్లు మంచి పోషకాహారం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మీరు గుడ్డును తింటే బలంగా ఉంటారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. దీన్ని తింటే చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలి  కూడా నియత్రణలో ఉంటుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినండి. 
 


పెరుగు

ఇడ్లీ, దోశలకు ప్రత్యామ్నాయంగా పెరుగును బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం మంచిది. ఒక కప్పు పెరుగును తింటే మీకు ఆరోగ్యకరమైన కేలరీలు అందుతాయి. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, కొవ్వులు పేరుకుపోకండా కాపాడుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

వోట్ మీల్

బరువు తగ్గాలనుకునే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు శరీరంలో అనవసరమైన క్యాలరీలు పేరుకుపోకుండా చేస్తాయి. ఓట్స్ ను పాలతో కలిపి తినడం వల్ల కూడా శరీరానికి ఎనర్జీ అందుతుంది.
 

సాబుదానా కిచిడీ

బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినని వారు సాబుదానా కిచిడీని తినొచ్చు. ఈ కిచిడీలో క్యారెట్లు, బఠానీలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలి. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు. 
 

రైస్ ఉప్మా

బరువు తగ్గాలనుకునే వారు రైస్ ఉప్మాను తినొచ్చు. దీనిలో ఫైబర్, విటమిన్ బి, కాల్షియం, జింక్ తో పాటుగా ఎన్నో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి.

click me!