ఇలా చేస్తే ఫ్రిడ్జ్ లేకున్నా.. పెరుగు పుల్లగా మారదు..!

First Published Apr 15, 2024, 10:29 AM IST

ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల మనం పెరుగు పుల్లగా మారదు. రెండు రోజులు అయినా తియ్యగానే ఉంటుంది. అంతేకాదు.. ఇలా చేస్తే.. మీరు పెరుగు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

curd

ఎండాకాలం వచ్చింది అంటే మనకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.  ఫ్యాన్, ఏసీ లేకుండా కాసేపు కూడా గడపలేం. తెచ్చిన కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. ఇవి మాత్రమే కాదు... ఈ ఎండల్లో పెరుగు వెంటనే పుల్లగా మారిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పుల్లగా మారుతూనే ఉంటుంది. ఈ ఎండలకు మనం కచ్చితంగా పెరుగు, మజ్జిగ తాగాల్సిందే. కానీ.. ఇలా వెంటనే పుల్లగా మారిపోవడం వల్ల తినలేం. అయితే... ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల మనం పెరుగు పుల్లగా మారదు. రెండు రోజులు అయినా తియ్యగానే ఉంటుంది. అంతేకాదు.. ఇలా చేస్తే.. మీరు పెరుగు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

soaked almonds

మీరు ముందు రోజు రాత్రి.. పెరుగులో నాలుగు లేదంటే.. ఐదు బాదం పప్పులను నానపెట్టాలి. రాత్రి మొత్తం ఈ బాదం పప్పులను నానపెట్టండి. తర్వాత... ఆ మరసటి రోజు కాగపెట్టిన పాలను చల్లార్చాలి. పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. పెరుగులో నానపెట్టిన బాదం పప్పులను చక్కగా కడిగి.. ఈ పాలల్లో వేయాలి. వాటితోపాటు.. ఒక ఎండు మిర్చీ కూడా  వేయండి.

curd

అంతే... నాలుగు లేదంటే ఐదు గంటల్లో మీకు పెరుగు రెడీ అవుతుంది. ఆ పెరుగు చాలా తియ్యగా ఉంటుంది. రెండు రోజులు అయినా ఈ పెరుగు పుల్లగా మారదు. తియ్యగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పెరుగులో ఉన్న బాదం పప్పులను మరుసటి రోజు పాలలో వేసుకోవచ్చు. ఈ నాలుగు బాదం పప్పులను కనీసం నాలుగు సార్లు వాడుకోవచ్చు. తర్వాత వాటాిని మనం తినేయవచ్చు.

curd

మళ్లీ కావాలంటే..  కొత్తగా బాదం పప్పులను తీసుకోవాలి.  అయితే.. ఈ బాదంపప్పులతో పాటు.. ఎండు మిర్చీ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండూ వేసినప్పుడు.. మళ్లీ పెరుగు తోడు వేయాల్సిన అసవరం లేదు. కావలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. పెరుగు మాత్రం చాలా తియ్యగా ఉంటుంది.

curd

ఇది మాత్రమే కాదు.. ఇంకో టెక్నిక్ కూడా ఉంది. మీ ఇంట్లో పుల్లగా ఉన్న పెరుగును ఒక క్లాత్ లో వేసి.. నీరంతా పోయే దాకా వడ కట్టాలి. పెరుగులో నుంచి నీరు మొత్తం పోయేదాకా వడ కట్టేయాలి. ఇప్పుడు వడ కట్టిన పెరుగును గోరు వెచ్చగా ఉన్న పాలల్లో వేసి బాగా కలపాలి.  కాసేపు ఈ పెరుగును కదల్చకుండా పక్కన పెట్టేయాలి. మూడు, నాలుగు గంటల్లో పెరుగు తియ్యగా తయారౌతుంది. పెరుగు తాయారైన తర్వాత.. దానిని ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది. ఈ రెండు టెక్నిక్స్ లో దేనిని వాడినా.. మీ పెరుగు తియ్యగా మారుతుంది. 

click me!