బెండకాయలు జిగురు లేకుండా కట్ చేయడం ఎలా..?

First Published | Aug 5, 2024, 12:30 PM IST

కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... జిగట లేకుండా బెండకాయ కట్ చేయవచ్చు అని మీకు తెలుసా..? మరి ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం...
 

చాలా మంది ఫేవరేట్ కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. దీనితో రకరకాల వంటలు చేయవచ్చు. ముఖ్యంగా బెండీ ఫ్రై చేస్తే పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు. తినడం వరకు బాగానే ఉంటుంది. కానీ... ఈ బెండకాయలు కోయడం పెద్ద రిస్క్ అబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి బెండకాయ తనడం ఇష్టం అయినా... దానిని కట్ చేయడానికి ఇష్టపడరు. కట్ చేస్తున్నప్పుడు దానిలో నుంచి ఒక జిగట పదార్థం వస్తుంది. అది చాలా మందికి చీదరగా అనిపిస్తూ ఉంటుంది. కానీ.. మనం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... జిగట లేకుండా బెండకాయ కట్ చేయవచ్చు అని మీకు తెలుసా..? మరి ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం...
 

okra

1.బెండకాయలను ఎలా శుభ్రం చేయాలి..?
బెండకాయలు కట్ చేసినప్పుడు జిగురు లేకుండా ఉండాలి అంటే.. ముందు వాటిని శుభ్రం చేసే విధానం తెలిసి ఉండాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే... బెండకాయ కూర వండటానికి ముందు వాటిని కడుగుతూ ఉంటారు. వంట చేయడానికి కొన్ని గంటల ముందే బెండకాయలను శుభ్రంగా కడిగి.. ఆ తర్వాత.. నీరు పోయేలా ఓ జల్లి బుట్టెలో వేయాలి. నీరు మాత్రం కారిపోయేలా పక్కన పెట్టేయాలి.


okra

2.బెండకాయలు ఆరబెట్టాలి..
నీరు కారిపోయిన తర్వాత..  ఒక శుభ్రమైన టవల్ ని తీసుకొని.. దానిపై బెండకాయలను ఆరపెట్టాలి. అప్పుడు దానిపై ఉన్న అదనపు తేమ అంతా పోతుంది. పూర్తిగా తడి అంతా పోయేలా చేస్తుంది.

3.సమాన పరిమాణంలో కట్ చేయాలి.

బెండకాయలలను  ముక్కలుగా కత్తిరించుకోవడానికి ముందు..  సమానంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్ లో దానిని కట్ చేసుకోవచ్చు. ఏకరీతిలో ఉంటే మంచిగా కుక్ అవుతాయి.

4. అంచులను కత్తిరించండి
బెండకాయ రెండు చివరలను కత్తిరించడం మర్చిపోవద్దు. చిట్కాలు సాధారణంగా కఠినంగా ఉంటాయి. ఆకృతిని ప్రభావితం చేయవచ్చు.

5. కత్తి మీద నిమ్మకాయ
బెండకాయ కట్ చేసే సమయంలో.. జిగట బయటకు రాకుండా ఉండేందుకు.. కట్ చేసే కత్తికి  ముందుగా నిమ్మకాయ రసం రుద్దాలి. ఇలా చేయడం వల్ల బెండకాయ నుంచి జిగురు రాదు.

6. పెరుగు లేదా నిమ్మరసం జోడించండి
వండుతున్నప్పుడు బెండకాయ కూర  ఇంకా జిగటగా  అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం లేదా పెరుగు కలపండి. ఇది జిగటను నివారించడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది.

Latest Videos

click me!