బెల్లం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వంటల్లోనే కాదు డైరెక్ట్ గా కూడా తింటుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి రోజూవారి ఆహారంలో బెల్లాన్ని చేర్చుకుంటుంటారు. అయితే మనకు కావాల్సిన మంచి బెల్లాన్ని ఎలా గుర్తించాలి? మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఇంట్లో బెల్లం ఎప్పుడు వాడుతూనే ఉంటాం. ఏ స్వీట్ చేయాలన్న బెల్లం తప్పనిసరి. బెల్లం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది కాబట్టి చాలా మంది చక్కెరకు బదులు బెల్లాన్ని వాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. బెల్లంతో రకరకాల పిండివంటలను ప్రిపేర్ చేస్తుంటారు.
23
చలికాలంలో బెల్లం తినడం శరీరానికి చాలా మంచిది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా రసాయనికంగా తయారుచేసిన బెల్లమే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిలో శుద్ధమైన బెల్లాన్ని మనం ఎలా గుర్తించాలో చూద్దాం.
33
రంగును బట్టి...
ముదురు రంగు బెల్లం కొనండి. లేత బంగారు రంగు కాదు. లేత గోధుమరంగు, లేత బంగారు రంగు బెల్లం తరచుగా రసాయనాలతో బ్లీచ్ చేయబడుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ముదురు రంగు బెల్లం శుద్ధమైనది. కల్తీ లేనిది. చెరకు నుంచి తయారవుతుంది.