కడుపునిండా భోజనం చేసిన తర్వాత కొద్దిగా ఏదైనా స్వీట్, డెజర్ట్ తిననిదే చాలా మంది భోజనం పూర్తి అవ్వదు. అయితే... అలా డెసర్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
కానీ.. అలాంటి సమస్య లేకుండా.. భోజనం తర్వాత తీసుకునే పది ఆరోగ్యకరమైన టేస్టీ డెసెర్ట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
కానీ.. అలాంటి సమస్య లేకుండా.. భోజనం తర్వాత తీసుకునే పది ఆరోగ్యకరమైన టేస్టీ డెసెర్ట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
తీపి తినాలని ఉంటే.. పండు తినమని చెబుతారేంటి అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారు డార్క్ చాక్లెట్స్ తొనొచ్చు. దాదాపు డార్క్ చాక్లెట్స్ లో షుగర్ తక్కువగా ఉంటుంది. 15 గ్రాముల డార్క్ చాక్లెట్ లో కేవలం 2 గ్రాముల షుగర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి.. కొద్దిగా తీసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. కొద్దిగా చాక్లెట్ తినడం కూడా గుండెకు మేలు చేస్తుంది.
యాపిల్ చిప్స్.. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల గుండెకు మంచిది. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులు మన దరిచేరకుండా రక్షిస్తుంది. అదే రోజూ యాపిల్ తినాలంటే అందరికీ నచ్చకపోవచ్చు. అలాంటివారు యాపిల్ చిప్స్ ని తీసుకోవచ్చు. యాపిల్ ని సనన్నని ముక్కులగా కోసి.. దానిపై కొద్దిగా నూనె రాసి.. తర్వాత ఓవెన్ లో బేక్ చేయాలి. వీటిని ఎలాంటి బయం లేకుండా తినొచ్చు.
సెరల్స్.. దాదాపు వీటిని చిన్న పిల్లలకు ఆహారంగా పెడుతుంటారు. కానీ సెరల్స్ ని పెద్దవారు కూడా తొనచ్చట. నోటికి తియ్యగా తగిలే ఈ సెరల్స్..తీపి తినాలనే మీ కోరికను తీరుస్తాయి. వీటిలో తక్కువ ఫ్యాట్ కలిగిన పాలు పోసుకొని తినాలి. వీటిలోనూ షుగర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది.
గ్రీకు యోగర్ట్.. దీనిలో ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు.
కర్జూరం( డేట్స్) ఇవి మనకు ఆరోగ్యానికి అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ భోజనం తర్వాత రెండు కర్జూరం తింటే సరిపోతుంది.
ఓట్ మీల్... దీనిని కూడా షుగర్ లేకుండా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ద్రాక్ష.. మామూలుగానే ద్రాక్ష తీయగా ఉంటాయి. ఇక.. ఎక్కువ సేపు ప్రిడ్జ్ లో స్టోర్ చేసి.. ఆ తర్వాత వీటిని తింటే.. మరింత తీయగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. తీపి తినాలనే కోరిక తీరుస్తుంది.
ఇవన్నీ కాదు అంటే.. స్వీట్ పొటాటో తినచ్చు. దీనిలో విటమిన్ ఏ, బీ6, సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.