Health Tips: ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. వీటిని తినడం మానేయండి

First Published | Dec 29, 2023, 1:06 PM IST

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను బాగా పెంచుతాయి. 

cholesterol

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే వీలైనంత తొందరగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. మరి కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రెడ్ మీట్

రెడ్ మీట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. దీన్ని తరచుగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది ఎన్నో రోగాలకు దారితీసే చెడు కొలెస్ట్రాల్ బాగా పెంచుతుంది. గొడ్డు మాంసం, పంది మాంసం, మటన్ వంటి రెడ్ మీట్ లో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రెడ్ మీట్ ను తినకపోవడమే మంచిది. 
 

Latest Videos


నూనెలో వేయించిన ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి నూనెలో వేయించిన ఆహారాలు కూడా కారణమవుతాయి. ఎందుకంటే వీటిలో కూడా సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  అందుకే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.
 

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలాచాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో చాలా మంది వీటిని బాగా తింటున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచివి కావు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడానికి దారితీస్తాయి.

వెన్న, జున్ను

వెన్న, జున్నులను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే వీటిలో కొవ్వు, సోడియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వీటిని తింటే కొలెస్ట్రాల్ ఇంకా పెరుగుతుంది. అందుకే వీళ్లు వీటిని పూర్తిగా మానేయడమో.. లేకపోతే తగ్గించడమో చేయాలి. 
 

కేకులు, కుకీలు

కేకులు, కుకీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ల రుచి గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. అందుకే చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. కానీ వీటిలో ఉప్పు, కేలరీలు, కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండటమే మంచిది. 
 

చక్కెర పానీయాలు

చక్కెర పానీయాల టేస్ట్ అదిరిపోతుంది. అందుకే చాలా మంది వీటిని రోజూ తాగుతుంటారు. కానీ ఈ పానీయాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే ఈ పానీయాలను మానేయడమే మంచిది. 

click me!