పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై అంటూ చాలా ఆహారాల్లో తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్యసమస్యల ముప్పు తప్పుతుంది. ఉల్లిపాయ రసం జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే పచ్చి ఉల్లిపాయలను తినడం మంచిది కాదు. ఫుడ్ అలెర్జీ కూడా ఉల్లిపాయల వల్ల వచ్చే అవకాశం ఉంది. ఆప్రికన్ హెల్త్ సైన్సెస్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, లీక్స్ లిలియాసి కుటుంబానికి చెందినవి. ఇవి అలెర్జీ క్రాస్ రియాక్టివిటీకి కారణమవుతాయి. అంటే మీకు అలెర్జీ ఉంటే ఉల్లిపాయలను తింటే సమస్య పెద్దది అవుతుంది. పచ్చి ఉల్లిపాయలను తిన్న తర్వాత ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. అసలు పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ అసౌకర్యం
పచ్చి ఉల్లిపాయల్లో ఫ్రక్టాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలను కలిగించే ఒక రకమైన కార్బోహైడ్రేట్. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది.
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్
పచ్చి ఉల్లిపాయలు తక్కువ అన్నవాహిక స్పింక్టర్ ను సడలించడంలో ప్రసిద్ది చెందాయి. అయితే దీనివల్ల కొంతమందిలో గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి.
చెడు శ్వాస
ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి నోట్లో దుర్వాసనను కలిగిస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన వీటిని మీరు తిన్న తర్వాత నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది.
అలెర్జీ
కొంతమందికి పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల అలెర్జీ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల అలెర్జీ వస్తే చర్మంపై దురద, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్య కూడా రావొచ్చు. ఉల్లిపాయ వల్ల అలెర్జీ వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
రక్తస్రావం ప్రమాదం
ఉల్లిపాయలలో విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఇది రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చి ఉల్లిపాయలను ఎక్కువ మొత్తంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వార్ఫరిన్ వంటి రక్తం సన్నబడటానికి మందులు తీసుకునే వ్యక్తుల్లో పచ్చి ఉల్లిపాయలు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.