ఉదయాన్నే పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 10, 2024, 5:21 PM IST

పాలు మంచి పోషకాలున్న పానీయం. కొంతమంది పాలను ఉదయాన్నే తాగితే.. మరికొంతమంది రాత్రిపడుకునే ముందు తాగుతుంటారు. అయితే ఈ పాలను పరిగడుపున తాగితే ఏమౌతుందో తెలుసా?
 


పాలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది మన శరీర సరైన అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మనం పాల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని సరైన పద్దతిలోనే తాగాలంటారు ఆరోగ్య నిపుణులు. అయితే కొంతమంది ఉదయాన్నే పరిగడుపున పాలను తాగుతుంటారు. కానీ ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 
 

పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ పాలను రోజూ తాగుతుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. అందుకే పాలను రోజూ తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. 

అయితే కొంతమంది తల్లులు తమ పిల్లలకు ఉదయాన్నే పాలు, బిస్కెట్లను తినిపిస్తుంటారు. అయితే మరికొంతమంది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలను ఇస్తుంటారు. నిజానికి చాలా మంది ఇండ్లలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఒక భాగం.

అయితే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తినకపోతే వాళ్లకు ఒక గ్లాస్ పాలను ఇచ్చి తాగమని చెప్తుంటారు. కానీ ఉదయం పరిగడుపున పాలను తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పరిగడుపున పాలను తాగితే ఏమౌతుంది? 

ఆయుర్వేదం ప్రకారం.. పరిగడుపున పాలను తాగడం మంచిది కాదు. పరిగడుపున పాలు తాడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే  హానే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పాలలో లాక్టోస్ అనే చక్కెర ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇన్సులిన్ ను పెంచుతుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. అందుకే వీళ్లు పరిగడుపున పాలను తాగకూడదు. 

ఇకపోతే కొంతమందికి లాక్టోస్ అసహనం ఉంటుంది. అంటే వీరికి పాలు అరగవు. ఇలాంటి వారు ఉదయాన్నే పరిగడుపున పాలను తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చర్మం దురద పెట్టడం, విరేచనాలు వంటి అలర్జీ రియాక్షన్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

మీకు తెలుసా? పరిగడుపున పాలను తాగితే మీ జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. అంటే ఉదయాన్నే పాలను తాగితే మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

పాలు ఆమ్లంగా ఉంటాయి. కాబట్టి  ఉదయాన్నే పరిగడుపున పాలను తాగితే కొంతమందికి ఎసిడిటీ సమస్య వస్తుంది. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలను తాగితే గుండెల్లో మంట వస్తుంది. అలాగే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలను తాగితే ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలలో ఉండే కాల్షియం.. ఐరన్ వంటి పోషకాల శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల మీ శరీరంలో పోషకాలు లోపిస్తాయి. 


కొవ్వు, సంక్లిష్ట పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉండే పాలను ఉదయాన్నే పరిగడుపున తాగితే మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో మీరు అజీర్థి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే ఫుల్ ఫ్యాట్ పాలలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి.  వీటిని మీరు ఉదయాన్నే పరిగడుపున తాగితే మీరు  ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. 

Latest Videos

click me!