ఇవి డయాబెటీస్ ఉన్నవారికి ఓ వరం..

First Published | Oct 10, 2024, 1:33 PM IST

డయాబెటిస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే కొన్ని ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అవేంటంటే? 

ఈ రోజుల్లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. డయాబెటీస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, ఒత్తిడితో కూడిన జీవనశైలి  వల్ల  షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 

కానీ డయాబెటీస్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా లేదా మీకే ఈ వ్యాధి ఉన్నా కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, మీ శరీరంలో పోషకాల లోపాన్ని తీర్చడానికి బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


bitter gourd

కాకరకాయ

కాకరకాయ చేదుగా ఉంటుంది. అయినా దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. చేదుగా ఉండే కాకరకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కాకరకాయలో ఉండే కొన్ని మూలకాల వల్ల ఇది మీ శరీరానికి ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది.

ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే కాకరకాయ డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కూరగాయలో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. 

వేప

ఆయుర్వేదంలో.. వేపను ఎన్నో ఏండ్లుగా ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వేప డయాబెటిస్ రోగులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలు పరిశోధనలు నిర్ధారించాయి. దీని జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. అలాగే ఇది ఇన్సులిన్ కు శరీరం సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది.

amla

ఉసిరికాయ

మధుమేహులకు ఉసిరికాయ ఒక వరం లాంటిది. ఈ పుల్లని కాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతంుది. అలాగే ఉసిరికాయలో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. అలాగే ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసే అయినా.. ఇది డయాబెటీస్ ఉన్నవారికి మాత్రం ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ చెక్కలో ఉండే మూలకాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అంతేకాదు ఇది ఇన్సులిన్ కు కణాల సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది. దీంతో మీ శరీరం రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దాల్చిన చెక్క డయాబెటిస్ తో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.

flaxseed

అవిసె గింజలు

డయాబెటీస్ పేషెంట్లకు అవిసె గింజలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. వీటిని తీసుకుంటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు త్వరత్వరగా ఆకలి కాదు. ఈ లిన్ సీడ్ లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లో ఉండే లిగ్నన్లు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!