పిస్తాపప్పు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పప్పులు మనల్ని ఎన్నో రోగాల నుంచి కూడా కాపాడుతాయి తెలుసా? ఈ పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పులో కాల్షియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి6, కె, సి, ఇ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకుంటే మీ ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటుంది. ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ గుప్పెడు పిస్తాలను తింటే ఏయే రోగాల ముప్పు తప్పుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..