గుడ్లు ఆడవారిలో ఈ సమస్యలను తగ్గిస్తయ్..! కానీ రోజుకు ఇన్ని గుడ్లే తినాలి? ఇంతకంటే ఎక్కువ తిన్నారో..!

First Published | Aug 27, 2023, 11:35 AM IST

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లను ఏ పూటైనా తినొచ్చు. పోషకాలు ఎక్కువగా ఉండే గుడ్లను తినడం వల్ల ఆడవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
 

మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీరి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలి. గుడ్డులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, ఫాస్పరస్, అమైనో ఆమ్లాలు, ఫోలేట్ లు కూడా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు గుడ్డును ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

మీరు అథ్లెట్ లేదా  గేమ్స్ కోసం కొన్ని గంటలు కష్టపడుతుంటే మీరు రోజుకు 4 నుంచి 6 గుడ్లను తినొచ్చు. అలాగే ఇతర మహిళలు రోజుకు 1 లేదా 2 గుడ్లను మాత్రమే తినాలి. అలాగే ఎండాకాలంలో ఎక్కువ గుడ్లను తినడం మంచిది కాదు. కాగా 40 ఏండ్లు దాటిన మహిళలు రోజుకు ఒక గుడ్డును తినడం చాలా ముఖ్యం. 
 


ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్డులోని తెల్లసొనను డైట్ లో చేర్చుకుంటే కండరాల నుంచి చర్మం వరకు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుడ్డులోని పచ్చసొనను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే మహిళలు రోజుకు ఒక గుడ్డును మాత్రమే తినాలి. 

egg

మహిళలు గుడ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

మెదడు ఆరోగ్యం 

గుడ్డులో ఉండే విటమిన్ బి6 మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందని ఎన్సీబీఐ తెలిపింది. గుడ్డును క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడులో హోమోసిస్టీన్ స్థాయిని తగ్గించి వృద్ధుల మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే గుడ్డులోని ఫోలేట్, విటమిన్ బి 12 ఒత్తిడిని తగ్గిస్తాయి. 
 

శరీరాన్ని శక్తివంతం

మనసును చురుగ్గా ఉంచడంతో పాటుగా గుడ్ల సాయంతో శరీరానికి శక్తిని అందించొచ్చు. దీన్ని తినడం వల్ల శరీరంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ల లోపం పోతుంది. అలాగే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. తరచూ అలసట నుంచి ఉపశమనం పొందుతారు. గుడ్డును దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. 
 

గుండె ఆరోగ్యం

గుడ్లు హెచ్డిఎల్ అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కు గొప్ప మూలం. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. శరీరంలో దాని స్థాయిని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు క్రమం తప్పకుండా ఒక గుడ్డును లేదా వారమంతా రెండు నుంచి ఆరు గుడ్లను తినొచ్చు. ఇది శరీరాన్ని చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే గుడ్లను మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి.

తరచూ ఆకలి సమస్య

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా గుడ్లను తినడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం ప్రకారం.. గుడ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల తరచుగా ఆకలి అయ్యే సమస్య ఉండదు. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ సూపర్ ఫుడ్ తినడం వల్ల మహిళలు ఊబకాయం, అతిగా తినడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 

కండరాలను బలంగా ఉంచుతుంది

రోజూ ఒక గుడ్డును తినడం వల్ల కండరాలు బలపడతాయి. ఇది మహిళల్లో కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 40 ఏండ్లు దాటిన మహిళలు ప్రతిరోజూ గుడ్లు తినాలి. దీన్ని తినడం వల్ల గాయాల ప్రమాదం కూడా తగ్గుతుంది.

Latest Videos

click me!