బొప్పాయిని తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

First Published | Aug 26, 2023, 1:02 PM IST

బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది మీరు బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల మీ ఆకలిని నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు మీ కడుపు నిండుగా ఉంటుంది. 
 

papaya

బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ వంటి విటమిన్లు ఉన్న బొప్పాయి బరువు తగ్గడానికి ఖచ్చితంగా సహాయపడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

papaya

నిజానికి బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. 


బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకం నుంచి ఉపశమనం పొందటానికి ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయిని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

papaya

ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొవ్వు ఆమ్లాలు, ఒలేయిక్ ఆమ్లాలు, ఫైబర్, మరెన్నో సమృద్ధిగా ఉండే ఈ పండు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

papaya

బొప్పాయిలో షుగర్ తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ బొప్పాయి తినొచ్చు. విటమిన్ కె పుష్కలంగా ఉండే బొప్పాయి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయి కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి చర్మంపై ముడతలను తొలగించడానికి కూడా సహాయపడతాయి.

Latest Videos

click me!