ఒక్కప్పుడు బిర్యానీలోకి మసాలా వంకాయను వండేవారు. ఇప్పుడు ఇది చూద్దామన్నా కరువైంది. నిజానికి ఈ చిన్న వంకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వంకాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో అవసరమవుతాయి. అసలు వంకాయ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వంకాయలో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ బి 5, విటమిన్ బి 6, విటమిన్ బి 9, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లతో పాటుగా 5.88 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 3.53 గ్రాముల నేచురల్ షుగర్, 0.18 గ్రాముల కొవ్వు, 0.98 గ్రాముల ప్రోటీన్ లు ఉంటాయి. అలాగే దీనిలో ఐరన్, కాల్షియం, జింక్, మాంగనీస్ లు కూడా మెండుగా ఉంటాయి.