నల్ల నువ్వులతో ఇన్ని లాభాలున్నాయా?

First Published | Oct 2, 2023, 11:16 AM IST

పితృపక్షంలో నల్ల నువ్వులను పితృదేవతలకు సమర్పిస్తారు. దీన్ని పూజలో వాడటమే కాకుండా.. ప్రసాదంగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

15 రోజుల పాటు కొనసాగే పితృ పక్షంలో లేదా శ్రాద్ధపక్షంలో నల్ల నువ్వులను విరివిగా ఉపయోగిస్తారు. దీనిని తర్పణ సమయంలో పూర్వీకులకు కూడా సమర్పిస్తారు. ఇలా ఎందుకు పితృదేవతలకు నల్ల నువ్వులను సమర్పిస్తారో తెలుసా? 

16 రోజుల పితృపక్షం భాద్రపద పూర్ణిమ తర్వాత ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చనిపోయిన పూర్వీకులను పూజిస్తారు. నల్ల నువ్వులతో నీళ్లను పోస్తారు. అలాగే నువ్వులను కూడా పంచి ప్రసాదంగా తింటుంటారు. పితృపక్షంలో ఋతువులు వేగంగా మారుతాయి. ఈ కారణంగా కాలానుగుణ మార్పుల వల్ల శరీరం కూడా మార్పులకు లోనవుతుంది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయి. అయితే నువ్వులు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడమే కాకుండా మన శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి.
 


బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది 

న్యూట్రీషియన్ జర్నల్ ప్రకారం.. నల్ల నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం, పొటాషియం , జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాలు, ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనెను కొన్ని సందర్భాల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి కూడా ఉపయోగిస్తారు. నల్ల నువ్వులు ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అందుకే ఇది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

మహిళలకు నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు

జర్నల్ ఆఫ్ ఫుడ్ కెమిస్ట్రీ ప్రకారం.. నల్ల నువ్వుల్లో డైటరీ ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల నువ్వుల్లో హార్మోన్లను నియంత్రించే లక్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో. అవిసె గింజల మాదిరిగానే నల్ల నువ్వులలో కూడా ఎక్కువ మొత్తంలో లిగ్నన్లు ఉంటాయి. అందుకే ఇది ఈస్ట్రోజెన్ పెంచే ఆహారాల జాబితాలో ఉంటుంది. నువ్వుల నూనెను వంటల్లో ఉపయోగిస్తే..  ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. 
 

నల్ల నువ్వులను ఎలా ఉపయోగించాలి

టాపింగ్ గా 

నల్ల నువ్వులను సలాడ్లు, స్టిర్ ఫ్రైస్, నూడుల్స్, కూరగాయలు, సుషీ, డెజర్ట్స్ వంటి బియ్యం వంటకాలు, రెడీ టూ ఈట్ ఓట్స్, పైస్ మొదలైన వాటిపై చల్లొచ్చు. నల్ల నువ్వులు కూడా మధ్యాహ్నం పెరుగు లేదా ఆపిల్ ముక్కలపై చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
 

మసాలా దినుసుగా 

నల్ల నువ్వులను మసాలా దినుసుగా తినాలంటే ముందుగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నీటిలో పది నిమిషాలు వేడి చేసిన తర్వాత పచ్చిగా తినొచ్చు. ఏదైనా వేడి ఆహారం వడ్డించే ముందు వెంటనే నల్ల నువ్వులను చల్లుకోవచ్చు. నల్ల నువ్వులను స్టిర్ ఫ్రైస్ గా కూడా తింటారు.

Latest Videos

click me!