డయాబెటీస్ నుంచి పొడవైన జుట్టు వరకు.. ధనియాలతో ఎన్ని లాభాలో..!

First Published | Sep 30, 2023, 4:30 PM IST

కొత్తిమీర విత్తనాలను ధనియాలు అంటారు. వీటిని మసాలా దినుసులుగా కూడా ఉపయోగిస్తారు. నిజానికి ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

ఇండియాలోని ప్రతి వంటగదిలో ఎన్నో రకాల మసాలా దినుసులు ఉంటాయి. మన దేశంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫుడ్ రుచిని పెంచడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ మసాలా దినుసులు ఆహారం రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. ఈ ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

కొత్తిమీర గింజలు మందంగా, గోధుమ రంగులో ఉంటాయి. ఇవి కొద్దిగా చేదుగా ఉంటాయి. అయినప్పటికీ.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ధనియాల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. మరి ధనియాల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ గింజల్లో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి మన కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణ సమ్మేళనాలు, రసాలను తయారు చేయడానికి కూడా సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మీకు అజీర్థి సమస్య ఎక్కువగా ఉంటే ధనియాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 
 

చర్మ సమస్యలను..

కాలిఫోర్నియా ఆయుర్వేద విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధన ప్రకారం.. ధనియాలు దురద, తామర, దద్దుర్లు, మంట ఎన్నో చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ గింజల్లో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అంతేకాదు  ఇవి నోటి పూతలు, గాయాలను నయం చేస్తాయి. 
 

డయాబెటిస్ పేషెంట్లకు.. 

భారతదేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. అయితే దీన్ని మందుల సాయంతో నియంత్రించొచ్చు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. ధనియాల సారం యాంటీ-హైపర్గ్లైసీమిక్, ఇన్సులిన్ విడుదల, ఇన్సులిన్ లాంటి కదలికను ఉత్పత్తి చేసే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉందని కనుగొన్నారు. ఇవి గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

coriander

జుట్టు పెరుగుదలకు.. 

జుట్టు బలహీనంగా ఉంటే విపరీతంగా రాలిపోతుంది. అయితే ధనియాలు జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ధనియాలు హెయిర్ ఫాల్ ను ఆపడమే కాకుండా కొత్త జుట్టు మొలిచేందుకు కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేసి జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
 

కొలెస్ట్రాల్ స్థాయిలను..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది స్ట్రోక్ కు కూడా కారణమవుతుంది. అందుకే శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. అయితే దీనికి ధనియాలు సహాయపడతాయి.  ధనియాల్లో కోరియాండ్రిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్న లిపిడ్ జీర్ణక్రియ ప్రక్రియను నియంత్రిస్తుంది.

click me!