అల్పాహారం ఏ టైమ్ కి తీసుకుంటున్నారు..?

First Published | Mar 26, 2021, 11:36 AM IST

అలా కాకుండా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఇన్సులిన్  , రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటిక్స్ దూరంగా ఉంటాయట.

ఈ మధ్యకాలంలో చాలా మంది అర్థరాత్రి దాటితే తప్ప నిద్రకు ఉపక్రమించడం లేదు. ఆలస్యంగా నిద్ర లేవడం చాలా కామన్ అయిపోయింది. దీంతో.. బ్రేక్ ఫాస్ట్ తినడం కూడా ఆలస్యమైపోతుంది. అయితే... అలా బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా తినడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా అవసరం. ఏం తింటున్నాం అని ముఖ్యం కాదు. కానీ.. ఏ సమయానికి తింటున్నాం అన్నది మాత్రం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. అల్పాహారం ఆలస్యంగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది
అలా కాకుండా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ , రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటిక్స్ దూరంగా ఉంటాయట.
అల్పాహారం ఉదయం 8గంటల 30 నిమిషాలకన్నా ముందు తీసుకుంటే.. వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయి.
చికాగోలోని నార్త్ వెస్ట్ యూనివర్శిటీ వారు ఇటీవల ఈ విషయంపై పరిశోధనలు చేశారు. 10,574 మందిపై పరిశోధన జరిపారు. వారు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారనే విషయంపై ఆరా తీయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసేవారు ఆరోగ్యంగా ఉండగా.. ఆలస్యంగా తినేవారిలో షుగర్ లెవల్స్ బాగా పెరిగాయని తేలింది.
కాగా... బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా తీసుకోవాలని అప్పుడు మరింత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!