సినీ రంగంలోకి దూసుకుపోయే తారలు చాలా మంది సపరేట్ గా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ప్రియంక చోప్రా.. రెస్టారెంట్ ని పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ అమ్మడు న్యూయార్క్ నగరంలో ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. మనీష్ గోయల్ తో కలిసి ఆమె దీనిని ప్రారంభించారు.
భర్త నిక్ జోనస్‌తో కలిసి రెస్టారెంట్ పూజ చేసిన ఫోటోల్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
“సినిమాల తర్వాత నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నా. నా రెస్టారెంట్ కి సోనా అనే పేరు పెట్టాను. సోనా అనేది బంగారం లాంటి భారత వంటకాలకు స్వరూపం.నేను భారత్‌లోనే పెరిగాను కాబట్టి, నా అభిరుచికి తగ్గట్లు, నేను తింటూ పెరిగిన వంటకాలన్నీ ఇందులో అందుబాటులో ఉంచుతాను.” అని అన్నారు.
కాగా.. ఈ సోనా రెస్టారెంట్ లోని ప్రత్యేకతలేంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
సోనా రెస్టారెంట్ ప్రధాన సీటింగ్ ప్రదేశం లోపల ఒక లుక్ మరియు మీకు వెంటనే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం గుర్తుకు వస్తుంది. రెస్టారెంట్ డెకర్ చాలా అందంగా ఉంటుంది.
పాత, కొత్త మోడల్స్ కలిపి అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. బంగారం, నలుపు, తెలుపు రంగుల కలయికతో దీనిని తీర్చిదిద్దారు.
రెస్టారెంట్ లుక్ మాత్రమే కాదు.. దీనిలో లభించే ఫుడ్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ రెస్టారెంట్ మెనూ ఏంటో ఓసారి చూస్తే..
రెస్టారెండ్ హెడ్ చెఫ్ హరినాయక్ ఇటీవల రెస్టారెంట్ లోని మోనూ లీక్ చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఆ ఫోటోలను షేర్ చేశారు.
దక్షిణ భారతదేశంలో ఇష్టంగా తినే కుల్చా( న్యూయార్క్ నాన్), దక్షిణాది వంటలు అప్పం, కేరళ కీమా రైస్ లాంటివి అక్కడివారిని తెగ ఊరిస్తున్నాయి. ఇవి కాకుండా.. మరికొన్ని వంటల పేర్లు కూడా బాగా వినపడుతున్నాయి.
సోనా రెస్టారెంట్లో భారత సాంప్రదాయ వంటకాలు చిల్లీ చీజ్ నాన్, జీడిపప్పు సాస్‌తో కూడిన కోఫ్తా కోర్మా వంటివి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రియాంక చోప్రాకు భారతీయ ఆహారం, ముఖ్యంగా పంజాబీ ఆహారం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వూల్లో వెల్లడించింది.
అందువల్ల, నూతనంగా ప్రారంభించిన ఈరెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ ఐటమ్స్‌కు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఫారెన్తో పాటు ఇండియన్ వెరైటీస్ అందుబాటులోకి రానున్నాయి