మిగిలిపోయిన అన్నంతో..చాక్లెట్ డిసర్ట్.. ఎప్పుడైనా ట్రై చేశారా?

First Published | Jul 27, 2024, 3:01 PM IST

ఈ చాక్లెట్ మౌసీ చేయడానికి ఎక్కువెక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు.. కేవలం.. మిగిలిపోయిన అన్నం, డార్క్ చాక్లెట్ ఈ రెండూ ఉంటే చాలు.
 

Dark Chocolate Mousse

మనకు అప్పుడప్పుడు.. స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చాక్లెట్ తినడం లేదంటే.. ఐస్ క్రీమ్ తినడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే... మనం ఇష్టంగా తినే చాక్లెట్ డిసర్ట్ ని... మిగిలిపోయిన అన్నం తో  చేసుకోవచ్చని మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేదా..?  ఇప్పటి వరకు మీరు మిగిలిపోయిన అన్నంతో... దోశలు, పునుగులు, రైస్ ఐటెమ్స్  లాంటివి చాలా  చేసుంటారు.

కానీ... చాలా సింపుల్ గా.. చాలా తక్కువ సమయంలో  ఈ చాక్లెట్ మౌసీ డిజర్ట్ చేయవచ్చు. దానిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం... ఈ చాక్లెట్ మౌసీ చేయడానికి ఎక్కువెక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు.. కేవలం.. మిగిలిపోయిన అన్నం, డార్క్ చాక్లెట్ ఈ రెండూ ఉంటే చాలు.


ముందుగా... మీరు డార్క్ చాక్లెట్ తీసుకొని.. దానిని మెల్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత... ఒక బ్లెండర్ తీసుకొని.. అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేయాలి. దానితోపాటు.. కొంచెం వేడి నీరు కూడా పోసి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత.. కరగపెట్టి ఉంచుకున్న డార్క్ చాక్లెట్ కూడా వేసుకొని.. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి.

Image: Getty Images

ఇప్పుడు.. ఈ మిశ్రమన్ని... ఒక కంటైనర్ లో.. పోసి.. డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. అంతే... రెండు గంటల తర్వాత.. డీప్ నుంచి బయటకు తీసి.. దానిపై కొద్దిగా... చాక్లెట్ తో గార్నిష్ చేసుకొని తింటే సరిపోతుంది. మీరు నమ్మరు.. రుచి అదిరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే.. కరిగిపోతుంది. మళ్లీ, మళ్లీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
 

మరి.. ఈ చాక్లెట్ మౌసీ ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం మీకు కలగొచ్చు.. ఇది మీ చాక్లెట్ మూసీని తయారు చేయడానికి మీరు ఉపయోగించే పదార్థాల రకాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా, చాక్లెట్ మూసీ వంటకాల్లో చక్కెర, హెవీ క్రీమ్,  కొన్నిసార్లు వెన్న ఉంటాయి, ఇది పోషకాహార స్థాయిలో తక్కువ రేటింగ్‌ను ఇస్తుంది. 

కానీ మీరు మంచి ప్రత్యామ్నాయాల కోసం ఈ పదార్ధాలను మార్చుకుంటే, అది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన డెజర్ట్ కోసం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అయితే.. మీరు.. పైన చెప్పిన డిజర్ట్ లో.. షుగర్ వాడకుండా.. కేవలం డార్క్ చాక్లెట్ వాడాం కాబట్టి.. ఇది ఒక విధంగా హెల్దీ అనే చెప్పొచ్చు. 

Latest Videos

click me!