తెల్ల నువ్వులు కాదు.. నల్ల నువ్వులతో ఎన్ని లాభాలు ఉన్నాయో..

First Published | Jul 27, 2024, 11:24 AM IST

నిజానికి ప్రతి ఒక్కరూ తెల్ల నువ్వులనే వాడుతుంటారు. కానీ నల్ల నువ్వులు కూడా వంటలను టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు నల్ల నువ్వులను తింటే ఏమౌతుందో తెలుసా?
 

Black Sesame Seeds

నువ్వులు తెలుపు లేదా నలుపు రెండు రంగుల్లోనూ ఉంటాయి. ఈ రెండు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి లక్షణాలను బట్టి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. నల్ల నువ్వులు నిగెల్లా సాటివా మొక్కకు కాస్తాయి. ఈ నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వులు శక్తివంతమైన రోగనిరోధక మాడ్యులేటర్ కూడా. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.  

నల్ల నువ్వులను ఎలా ఉపయోగిస్తారు? 

నల్ల నువ్వులను ఎన్నో రకాల నాన్, మఫిన్లు, కేకులు, గింజలు మొదలైన వాటిపై చల్లి డెకరేట్ చేస్తారు. తలనొప్పి, పంటి నొప్పి, ఉబ్బసం, ఆర్థరైటిస్, కండ్లకలక వంటి అన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. అసలు నల్ల నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


black sesame seeds

నల్ల నువ్వులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దగ్గు, గొంతునొప్పి, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నవారు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందుతారని పరిశోధనల్లో తేలింది. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. మంటను తగ్గించి అలెర్జీని నివారిస్తుంది. సైనసైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా నల్ల నువ్వులు ప్రయోజనకరంగా ఉంటాయి. 

నల్ల నువ్వులు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. నల్ల నువ్వుల్లో లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.

నల్ల నువ్వులు అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. అందుకే వీటిని హైబీపీ ఉన్నవారు తినాలని చెప్తుంటారు. మీకు తెలుసా? నల్ల నువ్వులు స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. 
 


నల్ల నువ్వుల నూనెతో రొమ్ములను మసాజ్ చేయడం వల్ల రొమ్ములో నొప్పి తగ్గుతుంది. అలాగే నల్ల నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే సన్నబడటాన్ని కూడా తగ్గిస్తాయి.అలాగే ఇవి సోరియాసిస్,  తామర లక్షణాలను మెరుగుపరుస్తాయి. ఫంక్షనల్ డిస్స్పెప్సియా వంటి సమస్యలున్నవారు నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్, పెద్దప్రేగు శోథ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Latest Videos

click me!