ఈ బిర్యానీ బంగారమహే... ధరెంతో తెలుసా..?

First Published | Feb 25, 2021, 12:17 PM IST

ఈ బిర్యానీ దుబాయిలో మాత్రమే దొరుకుతుంది. ప్లేట్ బిర్యానీ ఖరీదు రూ.20వేలు. ఇదేమైనా బంగారమా..? అంత ఖరీదు ఉండటానికి అని అనుకుంటున్నారా..? నిజంగానే అది బంగారమే

బిర్యానీ ధరెంత ఉంటుంది..? చిన్న చిన్న హోటల్స్ అయితే మనకు సింగిల్ బిర్యానీ రూ.150కి వచ్చేస్తుంది. అదే పెద్ద రెస్టారెంట్స్ కి వెళితే.. మహా అంటే రూ.500 కి వస్తుందేమో. అయితే.. ఈ బిర్యానీ తినాలంటే డబ్బులు జేబులో దండిగా పెట్టుకొని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. ఈ బిర్యానీ ధర మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉంటుంది.
ఈ బిర్యానీ దుబాయిలో మాత్రమే దొరుకుతుంది. ప్లేట్ బిర్యానీ ఖరీదు రూ.20వేలు. ఇదేమైనా బంగారమా..? అంత ఖరీదు ఉండటానికి అని అనుకుంటున్నారా..? నిజంగానే అది బంగారమే. ఈ బిర్యానీలో తినే బంగారం వాడతారు. దీని పేరు గోల్డ్ బిర్యానీ

దుబాయిలోని బాంబే బరో అనే భారతీయ రెస్టారెంట్ రాయల్ గోల్డ్ బిర్యానీ పేరుతో బిర్యానీ ని విక్రయిస్తోంది. దీని ప్లేట్ ధర 1000 దిర్హమ్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.20వేలు. 23 క్యారెట్ల తినే బంగారంతో ఈ బిర్యానీని గార్నిష్ చేస్తారు. అందుకే దీనికి గోల్డ్ బిర్యానీ అనే పేరు పెట్టారు.
కేవలం బంగారం చల్లడం వల్లే దీనికి ఇంత ఖరీదు పెట్టలేదు. దీనిలో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బిర్యానీ రైస్, కీమా రైస్, కుంకుమపువ్వుతో చేసిన అన్నం, తెల్లన్నంతో బిర్యానీ రెడీ చేస్తారు. దానిపై ఉడకబెట్టిన గుడ్లు, చిన్న బంగాళదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు అన్నీ ఉన్న ఆ ప్లేటు నోరూరిస్తుంది.
ఇంకా కశ్మీరీ గొర్రె కబాబ్, ఓల్డ్ దిల్లీ కబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కబాబ్స్, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి వాటిపై 23 కేరెట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. సైడ్ డిష్‌లు బిర్యానీలో కలుపుకునేందుకు వీలుగా నిహారీ సలాన్, జోధ్‌పురి సలాన్, బాదామీ సాస్, రైతాను ఇస్తారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు విచ్చేస్తుంటారు. ఇంత ఖరీదైన బిర్యానీ తయారు చేసే రెస్టారెంట్ ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

Latest Videos

click me!