సెలబ్రెటీల సీక్రెట్ బ్యూటీ డ్రింక్ ఇది. 21రోజుల్లో ఫేషియల్ మెరుపు

First Published | Sep 2, 2024, 10:23 AM IST

రెగ్యులర్ గా ఒక జ్యూస్ తాగితే... సహజంగానే మీరు అందంగా మెరిసిపోవచ్చు. మనం ఎన్ని క్రీములు, ఫేషియల్స్, ఆయిల్స్ రాసినా అవి.. పై పై మెరుగులు మాత్రమే అవుతాయి. కానీ.. మనం తీసుకునే ఆహారం మనకు అందాన్ని తెస్తుంది.


ప్రస్తుతం శుభకాలం నడుస్తోంది. మంచి ముహూర్తాలు ఉండటంతో.. ఎక్కువగా వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి స్పెషల్ అకేషన్ లో ఎవరికైనా స్పెషల్ గా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు.. అందరిలో కెల్లా తాము అందంగా, స్పెషల్ గా  కనిపించాలని అనుకుంటారు. దానికోసం ఫంక్షన్ కి మందు... బ్యూటీ పార్లర్ ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. గంటలు తరపడి.. వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఫేషియల్స్ చేయించుకుంటారు. అయితే.. వాటి గ్లో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.

కానీ.. ఆ అందం శాశ్వతం కాదు... అదే మనం కనుక రెగ్యులర్ గా ఒక జ్యూస్ తాగితే... సహజంగానే మీరు అందంగా మెరిసిపోవచ్చు. మనం ఎన్ని క్రీములు, ఫేషియల్స్, ఆయిల్స్ రాసినా అవి.. పై పై మెరుగులు మాత్రమే అవుతాయి. కానీ.. మనం తీసుకునే ఆహారం మనకు అందాన్ని తెస్తుంది.

లోపలి నుండి  మెరుపును పొందడానికి, మీరు సరైన రకమైన ఆహారం, జీవనశైలితో చర్మాన్ని నయం చేయాలి. సరైన హైడ్రేషన్, సరైన రకమైన భోజనం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ చర్మం మెరుస్తూ కనపడేలా చేస్తుంది. మీరు రెగ్యులర్ గా ఒక డ్రింక్ తాగితే చాలట.  ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలి..? ఎప్పుడు తాగాలి..? ఎలా తాగితే మీ చర్మం మెరుస్తూ కనపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ హెల్దీ బ్యూటీ డ్రింక్  తయారు చేయడానికి మనకు బీట్ రూట్ , క్యారెట్, కరివేపాకు, ఉసిరి లాంటి ఫుడ్స్ ఉంటే సరిపోతుంది. ఈ నాలుగుంటినీ.. కలిపి జ్యూస్ చేసుకొని వడగట్టి.. రోజూ ఉదయాన్నే తాగాలి.  ఈ జ్యూస్ లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ... చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు... అందంగా కనిపించేలా సహాయపడతాయి. 
 


1.బీట్ రూట్... బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై ముడతలు తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు... పొడి చర్మాన్ని తగ్గిస్తుంది.  ఎక్కువ కాలం చర్మం తేమగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.  దీనిలో లైకోపీస్, స్క్వాలీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మన చర్మం వృద్ధాప్యం బారినపడకుండా, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

2. క్యారెట్లు - అవి స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి:క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ సి , విటమిన్ ఇ ఉన్నాయి, ఇవి మీ చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి, సన్‌బర్న్‌ను నివారించడం , చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడం, సహజమైన మెరుపును అందిస్తుంది.

3. యాంటీఆక్సిడెంట్ల కోసం కరివేపాకు ఆకులు: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సి ఆరోగ్యకరమైన ఛాయతో సహాయపడతాయి. అంతేకాకుండా ఆకులలో బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి, ఇవి మీ చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించగలవు, కణాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తాయి.

4. ఆమ్లా కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది: ఉసిరి అనేది విటమిన్ సి  శక్తివంతమైన మూలం, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది - చర్మం  స్థితిస్థాపకత , దృఢత్వాన్ని నిర్వహించడానికి ఇది ఒక ముఖ్యమైన భాగం. అంతేకాకుండా, ఇది ముడతలు, ఫైన్ లైన్లు , వృద్ధాప్య మచ్చలను కూడా తగ్గిస్తుంది.
అందుకే.. ఈ నాలుగు కలిపి... జ్యూస్ చేసుకొని తాగడం వల్ల,... కచ్చితంగా మీ అందం రెట్టింపు అవుతుంది. ఈ డ్రింక్ అందాన్ని మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఈ నాలుగింటిలో ఉన్న పోషక విలువలు ఒకసారి చూద్దాం...

1. బీట్ రూట్ (Beetroot):
పోషకాలు:
కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, జింక్
విటమిన్ A, C, B6, ఫోలేట్
డైటరీ ఫైబర్
యాంటీఆక్సిడెంట్లు (బెటాలైన్స్)
శక్తి: 43 కేలరీలు (100 గ్రాములకి)

2. క్యారెట్ (Carrot):
పోషకాలు:
విటమిన్ A (బీటా-కెరోటిన్)
విటమిన్ K, B6
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం
డైటరీ ఫైబర్
యాంటీఆక్సిడెంట్లు (కెరోటెనోయిడ్లు)
శక్తి: 41 కేలరీలు (100 గ్రాములకి)

3. కరివేపాకు (Curry Leaves):
పోషకాలు:
విటమిన్ A, B, C, E
ఇనుము, కాల్షియం, ఫాస్ఫరస్
ఫ్లావనోయిడ్లు, టెర్పెనాయిడ్లు
యాంటీఆక్సిడెంట్లు
డైటరీ ఫైబర్

4. ఉసిరి (Amla):
పోషకాలు:
విటమిన్ C (పుష్కలంగా ఉంటుంది)
విటమిన్ A, E, B-కాంప్లెక్స్
కాల్షియం, ఐరన్, క్రోమియం
డైటరీ ఫైబర్
యాంటీఆక్సిడెంట్లు (ఫ్లావనోయిడ్లు, ఫినోల్స్)
శక్తి: 44 కేలరీలు (100 గ్రాములకి)
ఈ పదార్ధాలన్నీ శక్తివంతమైన పోషకాలను అందిస్తాయి, ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి.

Latest Videos

click me!