ఈ ఒక్కటి తిన్నా.. పురుషులకు ఆ సమస్యలే ఉండవు..

First Published Sep 1, 2024, 3:38 PM IST

మఖానా మంచి హెల్తీ ఫుడ్. కానీ దీన్ని చాలా తక్కువ మంది తింటారు. దీని టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా పురుషులకు. దీన్ని పురుషులు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? 
 

మఖానాలో లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఇవి పురుషులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును ఇవి హెయిర్ ఫాల్ నుంచి సంతాన సమస్యల వరకు.. మఖానా పురుషులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మఖానాను రోజూ తినడం వల్ల పురుషుల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వీళ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇవే కాదు వీటిని తిన్న పురుషులు దీనివల్ల ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మఖానాలోని పోషకాలు

మఖానాల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, భాస్వరం మెండుగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. 

మఖానా పురుషులకు ఏ విధంగా మేలు చేస్తుంది? 

ప్రోటీన్లు: మఖానాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది పురుషులు వారి శరీరానికి సరిపడా ప్రోటీన్ ను తీసుకోరు.ఇలాంటి వారు మఖానాను తింటే అవసరమైన పోషకాలు ఉందుతాయి. 
 

Latest Videos



గుండె ఆరోగ్యం: మఖానాలో ఉండే ఫైబర్, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి: మఖానాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు అతిగా తినలేరు. చిరుతిళ్లు తినలేరు. దీంతో మీరు బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. బరువు తగ్గాలనుకుంటున్నవారికి  ఇవి ఎంతో ఉపయోగపడతాయి. 
 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: మఖానాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని మధుమేహులు కూడా తినొచ్చన్న మాట. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మఖానాలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. 

లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది: మఖానాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ అనేది ఒక హార్మోన్. ఇది లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. 

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది: మఖానాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా మెండుగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 
 

మఖానాను పురుషులు ఎలా తినాలి? 

మఖానాను ఎన్నో రకాలుగా తినొచ్చు. వీటిని స్నాక్స్ గా తినొచ్చు.అయితే వీటిని పాన్ లో  నెయ్యితో కొద్దిగా వేయించి ఆ తర్వాత వేడి పాలలో ఒకటి లేదా రెండు గుప్పెడు మఖానా కలిపి రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దీని ప్రయోజనాలను పొందుతారు.

click me!