ఉదయాన్నే నిద్ర లేచేవారు టైప్ టూ డయాబెటిక్ బారిన తక్కువగా పడతారని ఇటీవల ఒక అధ్యయనం తేల్చేసింది. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు వల్ల బ్రేక్ ఫాస్ట్ కూడా చాలా త్వరగా చేస్తారు. ఇది రక్తంలోని ఇన్సులిన్ లెవల్స్ ను, చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచేలా చేస్తుందని కొత్త అధ్యయనంలో తేలింది.
ఎండోక్రైన్ సొసైటీ విర్చువల్ కాన్ఫరెన్స్ అయిన ఈఎన్ ఢీవో 2021 లో ఈ అధ్యయనం ప్రచురించబడింది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా చేసి టైప్ టు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అయితే దీనికీ ఉపవాసానికి ఏమీ సంబంధం లేదు. మామూలుగా ఉపవాసం చేసే వాళ్లు ఉదయాన్నే అల్పాహారం చేస్తారు. అయితే ఇది అలాంటిది కాదు అంటున్నారు అధ్యయనకారులు. మీరు ఉపవాసం చేయకపోయినా ఉదయాన్నే అల్పాహారం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేసిన వారిలో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని, ఇన్సులిన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయని అంటున్నారు. రెండు భోజనాల మధ్య సమయం పదిగంటలకంటే తక్కువగా ఉన్నా సరే ఇది వర్తిస్తుందని వారు చెబుతున్నారు.
హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద అమెరికాలో జరిపిన ఓ నేషనల్ సర్వేలో 10.571మందిని పరిశీలించి వారి డేటా ఆధారంగా ఈ విశ్లేషణకు వచ్చారు. భోజనం చేసే సమయం, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిల మధ్య ఓ సంబంధం ఉందని దీంట్లో తేలింది.
అప్పడప్పుడూ ఫాస్టింగ్ చేయడం లేదా ఆహారం తీసుకోకుండా పది గంటలు, అంతకంటే తక్కువ సమయం ఉండడం వంటివి ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉందని కనుగొనబడింది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ అయిన ఇన్సులిన్‌కు ఉపవాసం ఉన్నవారు తక్కువగా స్పందిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి ఇన్సులిన్ నిరోధకత ప్రమాద కారకం.
ఏదేమైనా, ఉదయం 8:30 గంటలకు ముందు బ్రేక్ ఫాస్ట్ చేసిన వ్యక్తులు, వారు ఉపవాసం ఉన్నారా లేదా అనేదానితో సంబంధం లేకుండా, ఇన్సులిన్ నిరోధకత తక్కువ స్థాయిలో ఉన్నట్లు కనుగొనబడింది.
ఉపవాసం ఉన్నారా లేదా అనేది రక్తంలోని చక్కెర స్థాయిల మీద ప్రభావాన్ని చూపించలేదు. కానీ బ్రేక్ ఫాస్ట్ చూపించింది. ఉదయం ఎనిమిదన్నరకు ముందు బ్రేక్ ఫాస్ట్ చేసిన వ్యక్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఉదయాన్నే చేసే అల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.
ఉపవాసం ఉన్నారా లేదా అనేది రక్తంలోని చక్కెర స్థాయిల మీద ప్రభావాన్ని చూపించలేదు. కానీ బ్రేక్ ఫాస్ట్ చూపించింది. ఉదయం ఎనిమిదన్నరకు ముందు బ్రేక్ ఫాస్ట్ చేసిన వ్యక్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఉదయాన్నే చేసే అల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.
మనం తీసుకునే ఆహార వేళలు మన శరీర మెటాబాలిజంతో ముడిపడి ఉంటుంది. ఉదయాన్నే తినే అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన భోజనం కాకపోయినా.. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది.
అందుకే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉన్న అల్పాహారంతో రోజును ప్రారంభించడం మంచిది. మీరు పండ్లు, నట్స్, పెరుగు, కూరగాయలు, గుడ్లు, హోల్ వీట్ టోస్ట్ లు.. ఉండేలా చూసుకోండి.