చార్మినార్ టూ హైటెక్ సిటీ: ఈ బిర్యానీలు టేస్ట్ చేశారా?

Published : Jan 31, 2025, 01:18 PM IST

చార్మినార్ నుంచి హైటెక్ సిటీలలో లభించే ఈ ఐదు బిర్యానీలు ఎప్పుడైనా రుచి చూశారా? కచ్చితంగా  రుచి చూడాల్సిన ఆ బిర్యానీల జాబితా ఇప్పుడు చూద్దాం...

PREV
16
చార్మినార్ టూ హైటెక్ సిటీ:  ఈ బిర్యానీలు టేస్ట్ చేశారా?

హైదరాబాద్ అంటేనే బిర్యానీ. ఈ మహానగరంలో మీరు ఏ ప్లేస్ కి వెళ్లినా కమ్మని బిర్యానీ దొరుకుతుంది.  ప్రపంచంలో  అన్ని ప్రదేశాల్లో మీకు బిర్యానీ దొరకచ్చు. కానీ.. అవేవీ హైదరాబాద్ బిర్యానీకి సాటిరావు. ఇప్పటి వరకు మీరు చాలా రకాల బిర్యానీలు రుచి చూసి ఉండొచ్చు. కానీ.. చార్మినార్ నుంచి హైటెక్ సిటీలలో లభించే ఈ ఐదు బిర్యానీలు ఎప్పుడైనా రుచి చూశారా? కచ్చితంగా  రుచి చూడాల్సిన ఆ బిర్యానీల జాబితా ఇప్పుడు చూద్దాం...
 

26


1.హోటల్ షాదాబ్....

చార్మినార్ లో బెస్ట్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే హోటల్ షాదాబ్ కి వెళ్లాల్సిందే.  ఈ హోటల్ షాదాబ్ లో ప్రతిరోజూ వేలాది మంది బిర్యానీ తింటూ ఉంటారు.  రుచికరమైన బిర్యానీతో పాటు  ఖీమా, పాయా, గుర్దా ఫ్రై, రోటీ , మరిన్ని  టేస్టీ ఫుడ్స్ కూడా అందిస్తారు.
ప్లేస్ : డోర్ నెం. 22-8, 111112, నయాపుల్ రోడ్, నయాపుల్, చట్టా బజార్, ఘాన్సీ బజార్, హైదరాబాద్
సమయాలు: ఉదయం 5 నుండి రాత్రి 11:45 వరకు

36

2.ప్యారడైజ్ బిర్యానీ...

 హైదరాబాద్‌లోని ప్రతి పర్యాటకుడికి ఇష్టమైన బిర్యానీ ప్రదేశం, పారడైజ్ 1953 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రసిద్ధ బిర్యానీ  పాత నగరంలో దాని ప్రధాన అవుట్‌లెట్‌ను కలిగి ఉంది, కానీ జూబ్లీ హిల్స్ , హైటెక్ సిటీతో సహా హైదరాబాద్ అంతటా దీని బ్రాంచ్ లు ఉన్నాయి.
ప్లేస్: హైదరాబాద్‌లోని బహుళ అవుట్‌లెట్‌లు
సమయాలు: ఉదయం 11 నుండి రాత్రి 11 వరకు

46

3. కేఫ్ బహార్:
ఇక్కడ అయితే ఫిష్ బిర్యానీ కూడా ప్రయత్నించవచ్చు.  ఇక్కడ కూడా మీరు అసలు సిసలైన హైదరాబాదీ బిర్యానీ రుచి చూడొచ్చు.టేస్టీ- ఫిష్ బిర్యానీని రుచి చూడొచ్చు.  నిజానికి, ఈ వంటకాన్ని అందించే అతి కొద్ది ప్రదేశాలలో ఇది ఒకటి. రుచి అద్భుతంగా ఉంటుంది. ధర కూడా బడ్జెట్ లోనే ఉంటుంది.  ఇక్కడ మీకు ప్లేస్ దొరకడమే కష్టం. 
ప్లేస్ : 3-5, 815/A, ఓల్డ్ MLA క్వార్టర్స్ రోడ్, అవంతి నగర్, హిమాయత్‌నగర్, హైదరాబాద్
సమయాలు: ఉదయం 10 నుండి 12 వరకు

56
biryani


4. గ్రాండ్ హోటల్: నగరంలోని మరొక ఐకానిక్ బిర్యానీ ప్రదేశం, గ్రాండ్ హోటల్ మొఘలాయి ట్విస్ట్‌తో ప్రామాణికమైన హైదరాబాదీ బిర్యానీని అందిస్తుంది. కొన్ని అదనపు మసాలా దినుసులను ఉపయోగించడంతో పాటు, వారు మాంసంపై అదనపు శ్రద్ధ వహిస్తారు. చికెన్, మటన్  చాలా మృదువుగా ఉంటుంది. హైదరాబాద్ లో బిర్యానీ ప్రియుల కోసం అర్థరాత్రి వరకు తెరిచే ఉంటుంది.
ప్లేస్: ప్లాట్ 4-1-395, బిగ్ బజార్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 12 నుండి 1 am5 వరకు. 

66

5.బావర్చి రెస్టారెంట్: హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోని ఐకానిక్ పేర్లలో బావర్చీ ఒకటి.  ఇక్కడ బిర్యానీ దొరకాలంటే కనీసం  30 నుంచి 40 నిమిషాలు ఎదురుచూడాల్సిందే. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుది.  దీనిని సరైన సుగంధ ద్రవ్యాలతో పరిపూర్ణంగా వండుతారు.  
ఎక్కడ: ప్లాట్ నం. 44, RTC క్రాస్ రోడ్, జవహర్ నగర్, చిక్కడపల్లి, న్యూ నల్లకుంట, హైదరాబాద్.
సమయాలు: మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11:30 వరకు

click me!

Recommended Stories