కొలెస్ట్రాల్ నుంచి వెయిట్ లాస్ వరకు.. నల్ల మిరియాలతో ఇన్ని లాభాలా..!

First Published | May 9, 2023, 1:16 PM IST

నల్లమిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. నల్లమిరియాలు సంక్రమణను నివారించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

నల్ల మిరియాలను ఎక్కువగా ఆహారాల్లో ఉపయోగిస్తారు. ఇవి ఫుడ్ ను చాలా టేస్టీగా చేస్తాయి. నిజమేంటంటే.. ఈ మసాలా దినుసుల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు నల్ల మిరియాలను తమ ఆహారంలో చేర్చడం మంచిది.

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన యాంటీబయాటిక్.


నల్ల మిరియాలు కఫానికి మంచి ఔషధం. గొంతు సంబంధిత వ్యాధులన్నింటికీ నల్ల మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. గొంతునొప్పి, అపానవాయువు నుంచి ఉపశమనం పొందడానికి నల్ల మిరియాల టీ ని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఉబ్బసం, అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి.

నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం మన కణాలు, కణజాలాలను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. దీంతో ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. నల్ల మిరియాలలో ఉండే పొటాషియం అనే ఖనిజం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా  ప్రయోజనకరంగా ఉంటాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నల్ల మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్లాక్ పెప్పర్ ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు హెర్బల్ టీలను కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి నల్ల మిరియాలను డైట్ లో చేర్చుకోవచ్చు. నల్ల మిరియాలలో ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ పెప్పర్ ను డైట్ లో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!