బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఉదయాన్నే ఇవి తినాలి

First Published | Dec 28, 2024, 11:38 AM IST

కొంతమంది కడుపునిండా తిన్నా బరువు పెరగడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఉదయాన్నే కొన్ని ఆహారాలను తింటే మాత్రం పక్కాగా బరువు పెరుగుతారు. అవేంటంటే? 

weight gain

ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరిగి తగ్గించుకోవడానికి ఎంతో తిప్పలు పడుతున్నారు. అలాగే కొంతమంది బక్కగా ఉన్నామని, బరువు పెరగడం ఎలా అని తెగ ఆలోచిస్తుంటారు. నిజానికి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా టెన్షన్ పడాలి. ఎందుకంటే ఈ రెండూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 


నిజానికి బరువు పెరగకుండా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాన్నే కొంచెమే తింటుంటారు. దీనివల్ల మరీ బక్కగా అవుతారు. కానీ బక్కగా ఉండటం వల్ల ఎప్పుడూ నీరసంగా, బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారికి ఏ పనీ చేతకాదు. అందుకే ఉండాల్సిన బరువు ఖచ్చితంగా ఉండాలి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు మీ శరీర బరువును పెంచడానికి బాగా సహాయపడతాయి. వీటిని గనుక మీరు ఉదయాన్నే తింటే మీరు బరువు పెరుగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



బరువును పెంచే ఆహారాలు

వేరుశెనగ వెన్నను తినాలి

బరువు పెరగాలనుకునే వారికి వేరుశెనగ వెన్న ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీరు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహాయపడతాయి. బరువు పెరగాలనుకుంటే ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున వేరుశెనగ వెన్నను తినాలి. ఇది కండరాలను బలంగా చేస్తాయి. కండరాలను పెంచుతుంది. ఇంతేకాదు వేరుశెనగ వెన్నతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రతిరోజూ బనానా షేక్ తాగండి

బనానా షేక్ కూడా మీరు హెల్తీగా బరువు పెరుగుతారు. అరటిపండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో పాటుగా కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అరటిపండును పాలతో కలిపి తింటే దానివల్ల కలిగే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. మీరు ఈ షేక్ ను ఎప్పుడైనా తాగొచ్చు. కానీ ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటే మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగిన శక్తి అందుతుంది. అలాగే ఇది మీ బరువును బాగా పెంచుతుంది. 
 

jaggery water

పరగడుపున బెల్లం నీరు తాగాలి

మీరు మరీ సన్నగా ఉండి, బరువును పెంచుకోవాలనుకుంటే మాత్రం చలికాలంలో బెల్లం నీటిని తాగడం మంచిదంటున్నారు నిపుణులు. బెల్లం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది చలికాలంలో ఎక్కువ చలి పెట్టుకుండా ఉంటుంది. అలాగే మీరు బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. మీరు బెల్లంతో బరువు పెరగాలనుకుంటే రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో బెల్లం ముక్కను వేయండి. ఈ వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగండి. ఇలా క్రమం తప్పకుండా తాగితే మీరు బరువు పక్కాగా పెరుగుతారు. 
 

గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తినండి

డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. నానబెట్టిన గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను ఉదయం పరిగడుపున తింటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఖర్జూరాలు, అంజీర, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని గనుక మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తింటే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఆరోగ్యంగానూ ఉంటారు. 

soaked almonds

నానబెట్టిన బాదం పప్పులు

బాదం పప్పులను నానబెట్టి తింటే మీరు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిని మీరు ఉదయాన్నే తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి మీ మెదడుకు పదును పెట్టడంతో పాటుగా మీరు ఆరోగ్యంగా బరువు పెరగడానికి కూడా సహాయపడతాయి. బాదం పప్పుల్లో ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఫైబర్, మాంగనీస్, ఒమేగా3, 6  కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. వీటిని తీసుకుంటే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. అలాగే మీ శరీరానికి అవసరమైన పోషణ కూడా అందుతుంది. క్రమం తప్పకుండా ఉదయం పరిగడుపున నానబెట్టిన 5 నుంచి 8 బాదం పప్పులను తినడం వల్ల మీరు బరువు పెరుగుతారు. 

Latest Videos

click me!