పెరుగును ఇలా మాత్రం తినకండి

First Published | Oct 19, 2024, 11:04 AM IST

పెరుగులో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని రోజూ ఒక కప్పు తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. కానీ పెరుగును కొన్ని ఫుడ్స్ తో మాత్రం అస్సలు తినకూడదు. ఎందుకంటే?

పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే పెరుగును రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

curd

కాలాలతో సంబంధం లేకుండా రోజూ ఒక కప్పు పెరుగును తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా హెల్తీగా ఉంటారు. అయితే పెరుగును తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లేదంటే దీనివల్ల మీరు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెరుగుతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. ఎందుకంటే ఈ ఆహారాలను పెరుగుతో కలిపి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 


పెరుగుతో వేటిని తినకూడదు

సిట్రస్ పండ్లు

పెరుగుతో సిట్రస్ పండ్లను పొరపాటున కూడా తినకూడదు. నిజానికి పెరుగు, సిట్రస్ పండ్లు రెండూ ఆరోగ్యకరమైనవి. కానీ ఈ రెంటింటిని కలిపి తింటే మాత్రం మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.  ఎందుకంటే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్-సి ని నాశనం చేస్తుంది.

దీనివల్ల మీ శరీరానికి విటమిన్ సి అందదు. అందులోనూ సిట్రస్ పండ్లను, పెరుగును కలిపి తింటే గ్యాస్, అపానవాయువు (పిత్తులు) వస్తుంది.

చేపలు

చేపలను, పెరుగును కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తింటే మీ శరీరంలో విష పదార్థాలు ఏర్పడతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఎన్నో  వ్యాధులను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గుడ్లు

గుడ్లు, పెరుగును ఒకేసారి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి గుడ్లు, పెరుగు రెండూ ప్రోటీన్ కు మంచి వనరు.

కానీ వీటిని కలిపి తింటే మీ జీర్ణక్రియ మరింత దెబ్బతింటుంది. అంటే ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, తిన్నది అరగకపోవడం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. 

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాల్లో కేలరీలు, నూనె ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చాలా మంది వేయించిన ఆహారాలతో పెరుగును తింటుంటారు. ఈ కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది. కానీ వేయించిన ఆహారాలను పెరుగుతో తింటే మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది.
 

ఊరగాయలతో

ఊరగాయలతో పెరుగును తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణఉలు చెబుతున్నారు. పెరుగు, ఊరగాయలు రెండూ ప్రీబయోటిక్స్ కు మంచి వనరులు.

కానీ వీటిని కలిపి తింటే మీ జీర్ణవ్యవస్థలో సూక్ష్మజీవుల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మీరు తిన్నది అరగడం కష్టంగా మారుతుంది. 

పాలు

పెరుగును, పాలను కలిపి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా తింటే మీ జీర్ణక్రియ మరింత దెబ్బతింటుంది. నిజానికి పాలు, పెరుగు రెండూ ప్రోటీన్ కు మంచి వనరులు. ఇది జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగిస్తుంది. 
 

పెరుగును ఎలా తినాలి? 

ఎప్పుడూ కూడా పెరుగును ఫ్రెష్ గానే తినాలి. 

అలాగే పెరుగును తినే ముందు దాంట్లో కొద్దిగా జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడిని వేసి కలపండి. 

పెరుగును  అన్నం లేదా రోటీతో కలిపి తినొచ్చు.

మీరు పెరుగును సలాడ్స్ లో మిక్స్ చేసి కూడా తినొచ్చు.

అయితే పెరుగు, పండ్లను తినడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Latest Videos

click me!