గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, శరీరంలో మంటను తగ్గించడానికి అవసరం. ఈ రెండు ఆహారాలూ కలిస్తే, మొత్తం ఆరోగ్యానికి, ఆనందానికి తోడ్పడే రుచికరమైన, పోషకమైన ఆహారం తయారవుతుంది.
గుడ్డు, చేపలను కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, రెండు ఆహారాలనూ సరిగ్గా వండుకుని, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కలుషితం అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి, వండడానికి ముందు చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేసుకోవడం వంటి మంచి ఆహార భద్రతా అలవాట్లను పాటించడం ముఖ్యం.