ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని రోజూ తినేవారున్నారు. కానీ ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, సంకలనాలు, సంరక్షణకారులు ఉంటాయి. ఇవి మీ న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అలాగే మీ మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ ఒంట్లో శక్తి తగ్గుతుంది. ఇది కోపాన్ని కూడా పెంచుతుంది.