ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కవుగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శరీరానికి అవసరమైన కొవ్వులలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒకటి. ఇవి శరీరానికి, మెదడుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలలో చేపలు ఒకటి. అందుకే సార్డినెస్, సాల్మన్ వంటి చేపలను తినండి.