వాతావరణంలో మార్పులు రాగానే ముందుగా.. జలుబు, జ్వరం, గొంతు నొప్పి లాంటివి వెంటనే వచ్చేస్తాయి. జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ.. జలుబు, గొంతునొప్పి లకు మందులు వాడినా కూడా వెంటనే ఉపశమనం కలిగించవు.
కనీసం రెండు, మూడు రోజులు ఇబ్బంది పడక తప్పదు. ఇలంటి సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ నొప్పి మరింత వేధిస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
1. పెరుగు..మీకు పెరగంటే ఎంత ఇష్టం ఉన్నా.. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు మాత్రం దానికి దూరంగా ఉండాల్సిందే. గొంతు నొప్పి, దగ్గు ఉన్న సమయంలో పెరుగు తింటే మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. పెరుగులో ఉండే కొన్ని పదార్థాలు.. దగ్గును మరింత ఎక్కువ చేస్తాయి.
2.చీజ్..చీజ్ లో కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గొంతు నొప్పి సమయంలో తినడం మాత్రం కరెక్ట్ కాదు.
3. సి విటమిన్ ఫుడ్స్..సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, ఆరెంజెస్ తినడం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవి తింటే అసలు జలుబు లాంటివి దూరంగా ఉంటాయి. అయితే.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు మాత్రం ఇవి తినకూడదు. ఇవి తినడం వల్ల ఎలర్జీ పెరిగే అవకాశం ఉంది.
4.నూనెలో వేయించిన పదార్థాలు..నూనెలో వేయించిన పదార్థాలు నాలుకకు రుచిగా ఉంటాయి. వాటిని తినాలని అందరూ ఆశపడతారు. అయితే.. గొంతు నొప్పితో బాధపడేవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
5. ప్యాకేజ్డ్ డ్రింక్స్..బయట మార్కెట్లో దొరికే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ లకు కూడా దూరంగా ఉండాలి. వాటిలో ఉపయోగించే షుగర్ కూడా గొంతు నొప్పిని మరింత పెంచే అవకాశం ఉంది.
6.చింతపండు..గొంతు నొప్పి సమయంలో చింత కాయ తింటే.. ఎలర్జీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు నొప్పి సమయంలో దూరంగా ఉండటం ఉత్తమం.