అందమైన కురులకు అదిరిపోయే ఫుడ్స్..!

First Published | Mar 1, 2021, 1:34 PM IST

మన జుట్టుపై అద్భుతంగా పనిచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటి ముందు ఈ వేలకు వేలు ఖర్చు చేసే షాంపూలు, నూనెలు ఎందుకూ పనికిరావనే చెప్పాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా... 

పట్టులాంటి జట్టు సొంతం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? అయితే... ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో అందమైన జుట్టు అన్న విషయం పక్కన పెడితే.. అసలు ఉన్న జట్టును ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు.
దాని కోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు, కండిషనర్స్ అంటూ.. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మరి.. ఇలాంటి ఖర్చు లేకుండా జట్టును కాపాడుకోలేమా అంటే... మన జుట్టుపై అద్భుతంగా పనిచేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటి ముందు ఈ వేలకు వేలు ఖర్చు చేసే షాంపూలు, నూనెలు ఎందుకూ పనికిరావనే చెప్పాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా...

కలబంద జుట్టు మరియు ముఖానికి చాలా మంచిదని మనకు తెలుసు. దీన్ని రసంగా కూడా తినవచ్చు. కలబంద రసం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
అరటి మరియు బాదం జుట్టు పెరుగుదలకు అంతేకాకుండా.. డ్యామేజ్ జట్టు రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అందువల్ల, అరటి-బాదం స్మూతీని క్రమం తప్పకుండా తీసుకోవడం జుట్టుకు మంచిది. అయితే.. వాటిలో షుగర్ కలపకుండా తీసుకోవడం బెటర్.
బార్లీలో ఇనుము మరియు రాగి పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి బార్లీతో ఉడికించిన నీరు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం, తినడం కూడా జుట్టుకు చాలా మంచిది. గుడ్లు, కోడి, పాలు, జున్ను, కాయలు, పెరుగు అన్నీ ప్రోటీన్ బెస్ట్ సోర్స్.
జుట్టుకు మెంతులు వేయడం మంచిది అని మీరు వినే ఉంటారు. జుట్టుకు మెంతుల గుజ్టు రుద్దడం మాత్రమే కాదు, రాత్రిపూట మెంతులు నానపెట్టి.. తెల్లారి ఆ నీరు త్రాగటం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Latest Videos

click me!