కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి వంటి ఎన్నో కారణాల వల్ల మన చర్మం దెబ్బతింటుంది. వీటికి తోడు చలికాలంలో పొడి గాలి కూడా మన చర్మాన్ని మరింత పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. వీటన్నింటి ప్రభావాలను తగ్గించుకోవాలంటే మాత్రం మనం కొన్ని రకాల ఆహారాలను తినాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కాంతివంతంగా కూడా చేస్తాయి. ఇందుకోసం ఏం తినాలో తెలుసుకుందాం పదండి.
బీట్ రూట్
ఈ ఎరుపు కూరగాయ మీ బుగ్గలను గులాబీ రంగులోకి మారుస్తుంది తెలుసా? అలాగే ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. బీట్ రూట్ రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి మొటిమలు తగ్గిపోతాయి.
Image: Getty Images
బాదం
బాదం పోషకాలకు మంచి వనరు. వీటిలో చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. బాదం పప్పులో ఉండే విటమిన్-ఇ చర్మంపై ముడతలు, నల్లమచ్చలను తగ్గిస్తుంది. బాదం లో యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి.
బెర్రీలు
బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరు. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. వీటితి తింటే ముఖంపై ముడతలు, సన్నతి గీతలు వంటి వృద్ధాప్య సమస్యలు తగ్గుతాయి. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్, డార్క్ స్పాట్స్ ను తగ్గించడానికి కూడా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
క్యారెట్లు
కొత్త కణాలు ఏర్పడటానికి, పాత కణాలను తొలగించడానికి అవసరమైన విటమిన్-ఎ క్యారెట్లలో పుష్కలగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ తయారీకి కూడా సహాయపడుతుంది. దీని వల్ల వృద్ధాప్య సమస్య తగ్గిపోతుంది. అలాగే మీ చర్మం అందంగా కనిపిస్తుంది. క్యారెట్లను తింటే చర్మం గ్లో గా కనిపిస్తుంది. అలాగే ఈ క్యారెట్లు డ్రై స్కిన్ సమస్యను తగ్గిస్తాయి.
skin care
సిట్రస్ పండ్లు
నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి. అలాగే కొత్త కణాల ఉత్పత్తికి, ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.