బంగారం.. బంగారం అని చచ్చిపోతుంటారు.. బంగారం ఏమైనా తింటామా ఏంటి..? ఈ మాట చాలా మంది నోటిలో వినే ఉంటారు. అయితే.. బంగారం నిజంగానే తింటున్నారు. ఈ మధ్యకాలంలో దోశ, కొన్ని రకాల స్వీట్లపై బంగారం పూత వేయడం గురించి వినే ఉంటారు. కాగా.. ఇప్పుడు తాజాగా బంగారం బర్గర్ వచ్చింది.
undefined
ఫాస్ట్ ఫుడ్ లో అందరూ ఇష్టపడే ఫుడ్ బర్గర్. దీనిని ఇప్పుడు 24క్యారెట్ల బంగారం పూత వేసి మరీ అందిస్తున్నారు. కొలంబియాలోని ఓ రెస్టారెంట్ ఈ బంగారు బర్గర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.
undefined
ప్రస్తుత కాలంలో బర్గర్ మనకు ఎక్కడపడితే అక్కడ దొరుకుతంది. మన దేశంలో బర్గర్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
undefined
మిగిలిన ఆహారాలతో పోలిస్తే దీని ధర కాస్త తక్కవ అనే చెప్పాలి. చీజ్, రైస్, వెజిటేబుల్, మీట్, చికెన్ ఇలా రకరకాల టేస్టుల్లో ఇది అందుబాటులో ఉంది.
undefined
ఇప్పుడు దీనిని ‘ఓరో మెక్ కోయ్’ అనే పేరుతో ఓ ప్రత్యేక బర్గర్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. డబల్ మీట్, చికెన్, చీజ్ లతో దీనిని స్వచ్ఛమైన 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేశారు.
undefined
24 క్యారెట్స్ బంగారంతో తయారు చేసిన బర్గర్ కాబట్టి దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
undefined
దీని ధర రెండు లక్షల కొలంబియన్ పెసోలుగా నిర్ణయించారు. మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే దీని ధర రూ.4191 అన్నమాట.
undefined
ఒక విధంగా ఈ ధర ఎక్కువే అయినప్పటికీ బంగారం పూతతో లభించే బర్గర్ కాబట్టి రుచి చూడవచ్చు.
undefined