రోజూ ఉదయాన్నే ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..!

First Published Sep 28, 2023, 11:05 AM IST

ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున ఉసిరి జ్యూస్ ను తాగితే ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

amla juice

ఉసిరికాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అంతేకాక హిందూ మతంలో ఉసిరికాయకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఉసిరి చెట్టును పూజిస్తారు. ఎందుకంటే ఈ చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని నమ్ముతారు.

ఉసిరికాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు ఎన్నో రోగాలు రాకుండా కాపాడుతాయి. ముఖ్యంగా ఉసిరి కాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గును, జలుబును తొందరగా తగ్గిస్తుంది. ఉసిరికాయ జ్యూస్ ను పరగడుపున తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


amla juice

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునే ఉసిరి జ్యూస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ప్రతిరోజూ పరిగడుపున ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇది మీ కేలరీలను బాగా కరిగిస్తుంది. ఇంకేముంది దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

amla juice

కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులకు కారణమవుతుంది. ఉసిరి జ్యూస్ లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ అంటు ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మీకు గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. 
 

శరీరాన్ని శక్తివంతం చేస్తుంది

ఉసిరి జ్యూస్ పోషకాలకు మంచి వనరు. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అందుకే దీన్ని ఎనర్జీ డ్రింక్ అని కూడా అంటారు. దీన్ని రోజూ తాగితే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతేకాదు ఇది మీ శరీరాన్ని ఫిట్, ఆరోగ్యం గా ఉంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది

ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో మీకు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్ సి ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పును కూడా తగ్గిస్తుంది. 
 

కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది

ఉసిరి కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయను తిన్నా, దీన్ని జ్యూస్ ను తాగినా కంటిచూపు మెరుగుపడుతుంది. ఉసిరికాయలో కెరోటిన్ ఉంటుంది. ఇది మన కళ్లకు చాలా మంచిది. మీరు రోజూ పరగడుపున ఉసిరికాయ జ్యూస్ ను తాగితే కళ్ల మంట, కంటిశుక్లం, చికాకు, హై డ్రైనెస్ వంటి సమస్యలు రావు. 
 

আমলকি

ఎముకలకు మేలు చేస్తుంది

మన ఎముకలు బలంగా ఉండాలంటే మన శరీరంలో కాల్షియం పుష్కలంగా ఉండాలి. శరీరంలో తగ్గితే ఎముకలు బలహీనపడటమే కాకుండా.. ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కాగా ఉసిరికాయ జ్యూస్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తాగితే మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

click me!