వంటగ్యాస్ వాడకుండా మన రోజు గడవదు. దీనికి ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీ ఇస్తోంది. ఆ రాయితీ అందుకోవాలంటే.. ఈ-కేవైసీ చేయడం తప్పనిసరి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. ప్రభుత్వ కార్యాలయాల చుట్టుూ తిరగకుండా ఇంట్లోనే ఈ-కేవైసీ చేసుకునే విధానం ఇది.
దేశంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో, వాళ్లంతా ఆధార్ ద్వారా ఈ-కేవైసీ చేయాలి. అన్ని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దీన్ని మొదలుపెట్టాయి.
27
వివరాల కోసమే ఈ రూల్
దేశంలో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ల గురించి తెలుసుకోవాలని కేంద్రం అనుకుంటోంది. అందుకే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ-కేవైసీని తప్పనిసరి చేశాయి.
37
నకిలీ కనెక్షన్ల తొలగింపు
ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్లతో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారేమో అని తెలుసుకోవడానికి ఆధార్ ద్వారా ఈ-కేవైసీ తప్పనిసరి చేశామని మంత్రి హర్‌దీప్ సింగ్ పురి చెప్పారు.
47
ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈ-కేవైసీ
దగ్గరలోని గ్యాస్ ఆఫీసుకు వెళ్లి ఆధార్, మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి సహాయంతో కూడా చేసుకోవచ్చు.
57
ఇంట్లోనే ఫోన్ ద్వారా ఇలా
ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటిని వాడి మొబైల్ యాప్ ద్వారా గ్యాస్ ఈ-కేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ ఉంటే ఇంట్లో కూర్చొని గ్యాస్ కేవైసీ చేసుకోవచ్చు.
67
కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.
భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లేదా హిందుస్థాన్ పెట్రోలియం.. మీరు ఏ కంపెనీ కస్టమర్ అయితే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో గ్యాస్ కన్స్యూమర్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక ఈ-కేవైసీ చేసుకోవచ్చు. తర్వాత గ్యాస్ కేవైసీకి ఆధార్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయాలి.
77
మీ ఫేస్ మ్యాచ్
గ్యాస్ కేవైసీ చివరి స్టెప్‌లో ఆధార్ యాప్ ద్వారా మీ ఫొటో తీసుకుంటారు. అది మ్యాచ్ అయితే ప్రాసెస్ అయిపోతుంది. రాయితీ పొందడంలో ఇబ్బందులు ఉండవు.