Ramadan Special:హైదరాబాద్ లో హలీం తినడానికి టాప్ 10 ప్లేసెస్ ఇవే..

First Published | Apr 5, 2022, 11:06 AM IST

Ramadan Special: రంజాన్ సీజన్ మొదలైనప్పటి నుంచి హలీం గుమగుమలు నోటిని ఊరిస్తుంటాయి కదూ.. ఇంకేంటి హైదరాబాద్ లో ఈ ప్లేసెస్ లో హలీం సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒక సారి టేస్ట్ చేయండి. ఆ ప్లేసెస్ ఏంటంటే.. 
 

కేఫ్ బహర్.. ఇది బషీర్ బాగ్ లో ఉంటుంది. ఈ కేఫ్ బహర్ లో నెయ్యితో తయారు చేసిన మటన్ హలీం సూపర్ గా ఉంటుంది. అందుకే ఈ ప్లేస్ దశాబ్దాల నుంచి ప్రాముఖ్యత సంపాదించుకుంది. హైదరాబాదీ స్టైల్లో హలీంను తినాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ కు వెళ్లొచ్చు. కానీ ఈ ప్లేస్ లో జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటారు. తినడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ రుచి మాత్రం అమోఘం అనే చెప్పాలి. 
 

పిస్తా హౌస్..  ఈ పిస్తా హౌస్ హైదరాబాద్ లోనే 10 కి పైగా బ్రాంచెస్ కలిగి ఉంది. ఇతర దేశాల్లో కూడా ఈ పిస్తా హౌస్ అనేక శాఖలను ఏర్పాటు చేసింది. ఇది హైదాబాద్ లో హలీం కు ఫేమస్. రుచికి రుచి, నాణ్యకు నాణ్యతను అందించడంలో ఇది ముందుంటుంది. ఈ పిస్తా హౌస్ 24 గంటలు హలీం ను అందుబాటులో ఉంచగలదు. 


షాదాబ్.. ఇది ఓల్డ్ సిటీలో ఉంటుంది.  షాబాద్ అనే హోటల్ పేరుతో నీలం రంగులో పెద్ద భవనం ఉంటుంది. ఇక్కడ చికెన్ కబాబ్ నుంచి మటన్ బిర్యానీ వరకు అనేక రకాల రుచులకు ప్రత్యేకత పొందింది. ఓల్డ్ సిటీలో ఈ హోటల్ యే ప్రత్యేమైంది. ఇక్కడ హలీం ఎంతో రుచిగా ఉంటుంది. 

బావర్చి.. హైదరాబాద్ లో ఏ మూలన చూసినా బావర్చి రెస్టారెంట్లే దర్శనమిస్తుంటాయి. అయితే ఈ బావార్చి ఒరిజినల్ బ్రాంచ్ మాత్రం ఆర్.టీ.సీ ఎక్స్ రోడ్ దగ్గరే ఉంటుంది. దీనికి ఇతర శాఖలేమీ లేవు. ఈ రెస్టారెంట్లో హలీం చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో వెళ్లి హలీం ను టేస్ట్ చేయొచ్చు. ఈ టేస్ట్ మరెక్కడా కనిపించదేమో అనిపిస్తుంది మరి. 
 

షా గౌస్.. హైదరాబాద్ లో షా గౌస్ లిప్ -స్మాకింగ్ హలీమ్ ఎంతో  రుచిగా ఉంటుంది. ఉడికించిన గుడ్డు, జీడిపప్పులు, డీప్ ఫ్రైడ్ చేసిన ఉల్లిపాయలతో హలీం ను వడ్డిస్తారు. దీన్ని నోట్లో అలా వేసుకోగానే అలా అలా కరిగిపోతూ ఉంటుంది. మొత్తంగా ఇక్కడ హలీం ది బెస్ట్ అనిపించుకుంటుంది. 

కేఫ్ 555.. ఇది మాసాబ్ ట్యాంక్ లో ఉంటుంది. కేఫ్ 555 పేరుతో ఈ మధ్యకాలంలో గొప్ప పేరు తెచ్చుకుంటోంది. ఇక్కడ మటన్ హలీం ఎంతో టేస్టీగా ఉంటుంది. అవికూడా సరసమైన ధరలకే లభిస్తాయి. సాయంత్రం వేళల్లో హుస్సెన్ సాగర్ ను చూసి కేఫ్ 555 వద్ద హలీం తింటే ఆ మజాయే వేరబ్బా.

సర్వి రెస్టారెంట్.. ఇది బంజారా హిల్స్ లో ఉంటుంది. ఇది పరిశుభ్రతకు మారు పేరనే చెప్పాలి. ఈ రెస్టారెంట్ లో హీరో హీరోయిన్లు సైతం తింటూ ఉంటారు. 

బెహ్రౌజ్.. ఈ ప్రదేశం మొత్తం నిజాం రాచరికాన్ని ప్రతిబింబింపచేస్తుంది. ఈ   ప్లేస్,  ప్యాకేజింక్ వంటివన్నీ ఆ యుగాన్ని గుర్తుచేస్తాయి. ఇక్కడి హలీం క్రీమీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. 

మెహఫిల్.. హైదరాబాద్ లో మరొప్రసిద్ది చెందిన మెహఫిల్ తినుబండారాలకు ప్రఖ్యాతి గాంచింది. దీని శాఖలు నగరంతా విస్తరించి ఉన్నాయి. అందులో నారాయణగూడలో కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ లో మటన్ హలీం ఎంతో టేస్టీగా ఉంటుంది. సాయంత్రమైతే చాలు హలీం ను టేస్ట్ చేయడానికి ఈ మెహఫిల్ చుట్టూ జనాలు గుమిగూడుతుంటారు. 

ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్..    ఈ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్లలో ఒకటి. ఈ రెస్టారెంట్ లో హలీం రంజాన్ సీజన్ కంటే ముందు నుంచే అందుబాటులోకి తెచ్చింది.  ఇక్కడ హలీం ఎంతో టేస్టీగా ఉంటుంది.  

Latest Videos

click me!