ఫుడ్ మీద ఆనంద్ మహీంద్రకు ఎంత ప్రేమ..!

First Published | May 18, 2022, 3:21 PM IST

ఫుడ్ విషయంలో పలు సందర్భాల్లో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన కొన్ని సందర్భాల గురించి ఓసారి ఇప్పుడు మనం పరిశీలించి చూద్దాం..

ఫుడ్ విషయంలో పలు సందర్భాల్లో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన కొన్ని సందర్భాల గురించి ఓసారి ఇప్పుడు మనం పరిశీలించి చూద్దాం..

వ్యాపార పరంగా ఎంతో బిజీగా ఉండే ఆయన.. సోషల్ మీడియా ద్వారా సామాన్యులకు చేరువయ్యారు. తమను నచ్చిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో.. ఆయన ట్వీట్స్ ఆధారంగా.. ఆయనకు ఫుడ్ మీద కూడా ఎంతో ప్రేమ ఉందనే విషయం అర్థమౌతుంది.

Latest Videos


Anand Mahindra

ఫుడ్ విషయంలో పలు సందర్భాల్లో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన కొన్ని సందర్భాల గురించి ఓసారి ఇప్పుడు మనం పరిశీలించి చూద్దాం..

anand mahindra

1.ఇడ్లీ..
ఇడ్లీ అనగానే... ఇడ్లీ అమ్మకు ఆనంద్ మహీంద్ర ఇల్లు కట్టించిన విషయం మీకు ఇప్పటికే గుర్తుకు వచ్చే ఉంటుంది. ఇతరులకు సాయం చేయాలి అనుకుంటే వయసుతో, ఆర్థిక స్థోమతతో సంబంధం లేదు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే ఇడ్లీ అమ్మ. ఆమె అసలు పేరు కమలాత్తాళ్‌ అయినా కూడా ఇడ్లీ అమ్మగానే తన అందరికీ పరిచయం. ఎందుకంటే 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అందిస్తూ పేదల ఆకలి తీరుస్తుంది కాబట్టి తనను అందరూ ఇడ్లీ అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు.

తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ అలియాస్ ఇడ్లీ అమ్మకు సొంత ఇల్లు అందజేస్తానని ఆనంద్ మహీంద్ర కొన్నాళ్ల క్రితం ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే ఆ ఇల్లు కట్టడం సకాలంలో పూర్తయ్యి మదర్స్ డే నాడు ఇడ్లీ అమ్మ చేతికి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్ చేసి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఆనంద్ మహీంద్ర. ఆమె ఇడ్లీ వ్యాపారం సాగేందుకు ఆయన ఆ ఇల్లు కటించడం విశేషం.

2.జిలేబీ..
ఇటీవల అమృతసర్ కి చెందిన ఓ యూట్యూబర్ జిలేబీకి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో ఫిబ్రవరి 2022లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్ర కంట పడగా.. ఆయన దీనిపై కూడా స్పందించారు.  ఆ జిలేబీ వీడియోపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని ది బెస్ట్ జిలేబీ కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం.

3.దోశ..
ముంబయి కి చెందిన ఓ వ్యక్తి.. దోశ లు వేస్తుండగా తీసిన వీడియో ఒకటి 2021 ఆగస్టులో వైరల్ గా మారింది. ఆ వీడియో పై ఆయన స్పందించారు. ఆ దోశలు వేస్తున్న వ్యక్తి పై ప్రశంసలు కురిపించారు. సదరు వ్యక్తి ముందు రోబోలు కూడా ఎందుకు పనికిరావు అనే ఉద్దేశం వచ్చేలా ట్వీట్ చేశారు. ఆ వీడియో చూశాక తనకు ఆకలి మొదలైందని అతను చెప్పడం విశేషం.

4.జపనీస్ ఫుడ్..
ఆయనకు జపనీస్ ఫుడ్ అంటే కూడా ఇష్టమే. ఈ విషయం కూడా ఆయన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఆయన జపనీస్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే.. ఏదో చిన్నపిల్లాడి వీడియో చూసి  ఆగిపోయానంటూ ట్వీట్ చేశారు.
 

5.ఇండియన్ థాలీ..
మరోసారి.. ఇండియన్ థాలీ గురించి కూడా ప్రస్తావించారు. తాను ఢిల్లీలో లేనని.. లేదంటే.. ఆదివారం.. ఇండియన్ థాలీ తినేవాడినంటూ పేర్కొనడం గమనార్హం.

6.లక్నో ఫుడ్..

మరోసారి లక్నో లోని ఫుడ్ గురించి ఆయన స్పందించారు. ఏదో ఫెస్టివల్ సందర్భంగా ఆర్జే చేసిన ట్వీట్ కి కామెంట్ చేశారు. ఆ ఫుడ్ చూస్తుంటే తనకు నోరూరిపోతోందని.. లక్నో వాళ్లు చాలా లక్కీ అంటూ ఆయన పేర్కొన్నారు.

7.ఐస్ క్రీమ్ దోశ..

ఈ కాంబినేషన్ ఆయన ఫ్యాన్ కాకపోయినప్పటికీ... ఓ స్ట్రీట్ వెండార్  వీడియోకి మాత్రం ఆయన స్పందించారు. తాను ఐస్ క్రీమ్ దోశ తినడానికి ఆసక్తి చూపించకపోయినా.. ఆ వెండార్ కొత్త ఆవిష్కరణకు మాత్రం ఫుల్ మార్క్స్ వేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
 

click me!