Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?

First Published | Nov 24, 2021, 10:27 AM IST

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.

బరువు తగ్గాలని కసరత్తులు చేసేవారు మనలో చాలా మందే ఉన్నారు. అయితే.. కసరత్తులు చేయడం వరకు ఒకే కానీ...  ఏ ఆహారం తింటే.. బరువు తగ్గుతామో.. పెరుగుతామో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో అరటి పండు మొదటగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మందిలో కన్ఫూజన్ ఉంది. అరటి పండు తింటే.. బరువు తగ్గుతామా..? బరువు పెరుగుతామా అనే విషయం లో క్లారిటీ లేదు. కాగా.. దీనిపై  తాజాగా నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు.

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.



అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయనేది వాస్తవం, బరువు తగ్గడానికి ప్రయత్నించే చాలా మంది పోషకాహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది.

అయినప్పటికీ, అరటిపండ్లు నిరోధక పిండి రూపంలో 'మంచి' కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి - బరువు తగ్గడం , బరువు నిర్వహణ రెండింటికి మద్దతు ఇచ్చే రకం. అదనంగా, అవి ఫైబర్‌తో నిండి ఉంటాయి, ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో తొందరగా ఆకలి కాదు. ఈ క్రమంలో బరువు తగ్గడం సులువు అని అనుకుంటూ ఉంటారు.

మాక్రోబయోటిక్ న్యూట్రిషనిస్ట్ , హెల్త్ ప్రాక్టీషనర్ శిల్పా అరోరా ND ప్రకారం, అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. తిన్న తర్వాత  ఇది ఆకలి తీరిన సంతృప్తిని అందిస్తుంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడటంలోనూ సహాయం చేస్తుంది.
 

అరటిపండ్లు సూక్ష్మపోషకాల యొక్క పవర్‌హౌస్, ఇవి శరీరం  సరైన రీతిలో పని చేయడానికి సహాయం చేస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే.. దీనిని  ఉదయం అల్పాహారంగా మాత్రమే తీసుకోవాలట.   లేదంటే.. వ్యాయామానికి ముందు తీసుకోవాలట.  అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది, కాబట్టి అవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి.. ఇది తింటే.. బరువు పెరుగుతారనే భయం అస్సలు పెట్టుకోకూడదు.

Latest Videos

click me!