ఒకప్పుడు వంట పాత్రలు అంటే... ఐరన్, మట్టి పాత్రలు, ఇత్తడివే ఉండేవి. కానీ... ఇప్పుడు అందరూ నాన్ స్టిక్స్ మీద పడ్డారు. వాటిల్లో వంట చేయడం సులభమని.. కూర అడుగు అంటదని వాటిని వాడటం మొదలుపెట్టారు. కానీ.... ఎప్పుడైతే అవి ఆరోగ్యానికి మంచిది కాదని.. తెలిసిందో.. ఇప్పుడిప్పుడే.. మళ్లీ జనాలు ఐరన్ వంట పాత్రలు కొనడం మొదలుపెడుతున్నారు.
ఐరన్ పాత్రల్లో వంట చేయడం వల్ల .. దానిలోని ఐరన్ వంటలో చేరుతుందని తద్వారా మన శరీరానికి కూడా ఐరన్ అందుతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ అందులో నిజం ఎంత..? నిజంగా ఐరన్ ఆహారంలోకి చేరుతుందా..? ఇది మంచిదా కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
కాస్ట్ ఇనుప పాత్రలు సహజంగా నాన్-స్టిక్ వంటసామానుగా పనిచేస్తాయి. శుభ్రపరచడం సులభం, తక్కువ నూనెను వినియోగిస్తాయి, అనేక ఉష్ణ వనరులతో (గ్యాస్, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్) బాగా పని చేస్తాయి , ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచడానికి వేడిని కలిగి ఉంటాయి. తుప్పు పట్టడం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. కానీ... దానిని కూడా శుభ్రపరిచే విధానం తెలిస్తే... తుప్పు పట్టకుండా ఉంటుంది.
ఈ పాత్రలలో వంట చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయని, సహజంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుందని, రక్తహీనత చికిత్సకు ఉపయోగపడుతుందని చాలా అధ్యయనాలు , పరిశోధనలు నిర్ధారించాయి, ముఖ్యంగా పిల్లలలో రక్త హీనత సమస్యలు రాకుండా ఉంటాయి.
అయితే, నిపుణులు అనేక ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ కాస్ట్ ఐరన్ వాడకానికి వ్యతిరేకంగా కూడా హెచ్చరిస్తున్నారు.
"ప్రపంచవ్యాప్త అధ్యయనాలు కాస్ట్ ఐరన్ పాత్రలు ఆహారంలో వివిధ స్థాయిల ఇనుమును జోడించవచ్చని నిరూపించాయి. కానీ ఆహారంలో ఇనుము లీచింగ్ పరిమాణం స్పష్టంగా ఆహారం యొక్క pH స్థాయి, , ఆహారాన్ని వండడానికి అవసరమైన సమయం, వంటసామాను దీర్ఘాయువుపై ఆధారపడి ఉంటుంది. ," అని నిపుణులు తెలిపారు.
ఐరన్ పాత్రలను వాడొచ్చు. కానీ...వాటిని వాడే క్రమంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ పాత్రల్లో పులుపు కు సంబంధించిన వంటలను ఉంచకూడదు. ఉదాహరణకు చింతపండు, టమాట, నిమ్మకాయ లాంటి వాటిని వండకూడదు. అందులో ఉంచకూడదు. దీని వల్ల ఆహారం విషంగా మారుతుంది. కాబట్టి... ఇలాంటివి మాత్రం అస్సలు వండకూడదని సూచిస్తున్నారు.