ఆ దేశంలో డిన్నర్ ఏ టైంకి చేస్తారో తెలుసా..?

First Published | Oct 30, 2021, 2:56 PM IST

ఒక్కో దేశంలో.. ఒక్కో సమయంలో డిన్నర్ చేస్తారు. మరి ఏ దేశంలో ఏ సమయంలో డిన్నర్ చేస్తారో తెలుసుకుందామా..? ట్రావెలింగ్ లో భాగంగా.. మీరు విదేశాలకు వెళితే.. ఈ సమాచారం సహాయపడొచ్చు.
 

మనం తినే ఆహారం లో తేడాలు ఉండొచ్చు.  కానీ.. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారం తీసుకోకుండా.. మనం జీవించలేం. కాబట్టి.. అందరం ఆహారం తీసుకుంటాం. అయితే.. ఒక్కో దేశంలో.. ఒక్కో సమయంలో డిన్నర్ చేస్తారు. మరి ఏ దేశంలో ఏ సమయంలో డిన్నర్ చేస్తారో తెలుసుకుందామా..? ట్రావెలింగ్ లో భాగంగా.. మీరు విదేశాలకు వెళితే.. ఈ సమాచారం సహాయపడొచ్చు.

1.భారత్.. మన దేశంలో ప్రజలు ఆహారం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. రాత్రిపూట విందు విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. భారత్ లో రెస్టారెంట్లు.. రాత్రి 7గంటల నుంచి రాత్రి 11గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. ఈ సమయంలోనే భారతీయులు డిన్నర్ చేస్తుంటారు.
 


2.నార్వే.. మీరు ఒకవేళ నార్వేలో ఉంటే.. అక్కడ డిన్నర్ చాలా త్వరగా చేస్తారు తెలుసా..? సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే పూర్తి చేయాలి. ఇక నార్వే దేశస్తులు అయితే.. ఇంకా త్వరగా అంటే.. సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్యలోనే డిన్నర్ పూర్తి చేస్తారు.

3.జపాన్.. ఇక జపాన్ లోనూ కాస్త తొందరగానే డిన్నర్ ప్రారంభిస్తారట. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10గంటల మధ్యలో వారు డిన్నర్ తీసుకుంటారట.

4.దక్షిణాఫ్రికా.. ఇక దక్షిణాఫ్రికాలో  అక్కడి ప్రజలు రాత్రి పూట భోజనం రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్యలో పూర్తి చేస్తారు.

5. అమెరికా.. అమెరికా దేశంలో అక్కడి ప్రజలు సాయంత్రం 4గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 59 నమిషాల లోపు తమ డిన్నర్ పూర్తి చేస్తారు.

dinner

6.మెక్సికో.. ఇక  మెక్సికో దేశంలో  రాత్రిపూట భోజనం చాలా సింపుల్ గా తీసుకుంటారు. స్నాక్స్ మాత్రమే తీసుకుంటారు. అది కూడా రాత్రి 7 గంటల నుంచి 9గంటల మధ్యలో తీసుకుంటారు.

7.బ్రెజిల్.. ఇక బ్రెజిల్ లో ప్రజలు డిన్నర్ కచ్చితంగా తమ కుటుంబసభ్యులతో కలిసి మాత్రమే చేస్తారు. అది కూడా రాత్రి 7 గంటల నుంచి 8గంటల మధ్యలో మాత్రమే చేస్తారు.

8.చైనా.. చైనీస్ ప్రజలు తమ రాత్రి భోజనం దాదాపు 6గంటల 30 నిమిషాల నుంచి 7గంటల 30 నిమిషాల మధ్యలో పూర్తి చేస్తారు.

9.ఫ్రాన్స్.. ఇక ఫ్రాన్స్ లో ప్రజలు రాత్రి భోజనం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో పూర్తి చేస్తారు. కొంచెం ఆలస్యమైతే.. రాత్రి 10 గంటల లోపు పూర్తి చేస్తారు.

Couple Dinner

10.ఇక యునైటెడ్ కింగ్ డమ్( యూకే) లో  రాత్రి 6గంటల 30 నిమిషాల నుంచి 8గంటల మధ్యలో పూర్తి చేస్తారు. ఇక ఇటలీలో.. రాత్రి 8గంటల మధ్యలో పూర్తి చేస్తారు.

model dinner

11.స్పెయిన్ లో ఆ దేశ ప్రజలు రాత్రి 9గంటల నుంచి 11 గంటల మధ్యలో పూర్తి చేస్తారు. ఇక ఆస్ట్రేలియాలో చాలా తొందరగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత.. వారు తమ కుటుంబంతో సమయం గడపాలని అనుకుంటూ ఉంటారు.

Latest Videos

click me!