సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆహారానికి మంచి రుచిని ఇస్తాయి. దీన్ని అన్ని రకాల ఆహారాల్లో వాడొచ్చు.
నిమ్మరసం:
సిట్రస్ రసాలు, ముఖ్యంగా నిమ్మకాయలు, చేపలు, చికెన్, కూరగాయల రుచిని పెంచుతాయి. ఇవి పండ్లు, కూరగాయల్లో ఉండే సహజ తీపిని బయటకు తీస్తాయి. మసాలాల రుచిని కాపాడతాయి.
సిట్రస్ తొక్క:
నిమ్మ, నారింజ, ద్రాక్షపండు తొక్కను రకరకాల ఆహారాల్లో వాడొచ్చు. ఇది ఆహారానికి మంచి వాసనని ఇస్తుంది.
వెనిగర్:
బాల్సామిక్ వెనిగర్ ఇది మొక్కల నుంచి వచ్చే తీపిని కలుపుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్:
దీన్ని బరువు తగ్గడానికి, మసాలాగా, సూప్‌లలో చివరిగా వేస్తారు.
పౌష్టికాహార బేకింగ్ ఈస్ట్:
ఇది చీజ్ లాంటి రుచిని ఇస్తుంది. దీన్ని సూప్, సాస్, పాప్‌కార్న్‌లో వాడొచ్చు.
పుట్టగొడుగులు:
ఎండిన పుట్టగొడుగులు ఆహారానికి ఎక్కువ రుచిని ఇస్తాయి.