గుడ్లను ఇలా అస్సలు తినకూడదు

First Published | Oct 5, 2024, 3:02 PM IST

గుడ్లు మంచి పౌష్టికాహారం. వీటిలో రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే అంటారు రోజుకు ఒక గుడ్డును తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని. కానీ గుడ్లను కొన్ని విధాలుగా తింటే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది. 

eggs

గుడ్లను తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మీకు తెలుసా? గుడ్లలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

ఇవి ప్రోటీన్ కు మంచి వనరు. గుడ్లలో విటమిన్ బి 12, విటమిన్ బి 2, విటమిన్ డి, విటమిన్ ఎ, భాస్వరం, ఇనుము, సెలీనియం వంటి విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. 


గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లలో జియాక్సంతిన్, లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

గుడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే? ఇది మన మనస్సు నుంచి ఎముకల వరకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం గుడ్డును సక్రమంగా తినాలి.

అయితే చాలా మంది గుడ్లను తినేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే గుడ్లను తినేటప్పుడు చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పచ్చి గుడ్డు లేదా తక్కువగా ఉడికించిన గుడ్లను తినడం

నిజానికి గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ పచ్చి గుడ్డును లేదా తక్కువగా ఉడికించిన గుడ్డును అస్సలు తినకూడదు. ఎందుకంటే పచ్చి గుడ్డు లేదా తక్కువగా ఉడికించిన గుడ్డును తింటే  సాల్మొనెల్లా సంక్రమణ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల మీకు వాంతులు, విరేచనాలు, జ్వరంతో పాటుగా ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గుడ్లను ఎప్పుడు తిన్నా సరిగ్గా ఉడికించి తినండి. 


పచ్చసొన తినకూడదు

చాలా మంది గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే తింటుంటారు. ఎందుకంటే పచ్చసొనలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని దీన్ని తింటే ఒంట్లో కొవ్వు పెరుగుతుందని, బరువు పెరిగిపోతామని అనుకుంటారు. దీనివల్ల గుడ్డు పచ్చసొనను పక్కన పెట్టేస్తుంటారు. కానీ గుడ్డు పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మీకు తెలుసా? పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 12, ఫోలేట్ లు ఉంటాయి. అలాగే లుటిన్, కోలిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

ఇవి మనల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మన మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు కేవలం గుడ్డు పచ్చసొనను మాత్రమే తింటే గుడ్డును తినడం వల్ల కలిగే మొత్తం ప్రయోజనాలను పొందలేరు. 
 

తప్పుడు ఆహార కలయికలు

ఉడక బెట్టిన గుడ్డు, ఆమ్లెట్ తో పాటుగా గుడ్డును ఎన్నో రకాల ఇతర ఆహారాలతో తింటుంటారు. కానీ కొన్ని ఆహారాలతో గుడ్లను అస్సలు తినకూడదు.

ఎందుకంటే తప్పుడు ఆహారాల కలయిక మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీరు వైట్ బ్రెడ్ వంటి  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలతో గుడ్లను తింటే మీ  ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. 

అలాగే షుగర్ డ్రింక్స్ మొదలైన వాటితో తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అలాగే గుడ్డులోని పోషకాల శోషణ కూడా మీ శరీరంలో సక్రమంగా జరగదు.

అందుకే గుడ్లను తిన్నప్పుడల్లా ఫుడ్ కాంబినేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గుడ్లను అవొకాడోలు, తృణధాన్యాలు లేదా కూరగాయలు మొదలైన వాటితో తినండి. మంచి ప్రయోజనం పొందుతారు. 
 

ఎక్కువ గుడ్లు తినడం

గుడ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ వీటిని ఎక్కువగా తింటే మాత్రం మంచి కాకుండా.. చెడు జరుగుతుంది. దీనివల్ల మీరు సమతుల్య ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేరు. మీరు ఒకేసారి గుడ్లను ఎక్కువగా తీసుకుంటే మీ శరీరంలో కేలరీల సంఖ్య పెరుగుతుంది.

అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. దీనివల్ల కొంతమందికి గుండె జబ్బులు కూడా వస్తాయి. మీరు గుడ్లను ఎక్కువగా తింటుంటే ముందు ఆరోగ్య నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోండి. గుడ్ల మొత్తాన్నితగ్గించండి. 

Latest Videos

click me!