Cardamom: యాలకులు వీరు మాత్రం తినకూడదు.. ఎందుకో తెలుసా?

Published : Feb 22, 2025, 04:53 PM IST

యాలకులను చాలా వంటలకు మనం వాడుతూనే ఉంటాం. రుచితో పాటు సువాసనను కూడా అందించే ఈ యాలకులు చాలా మంది తినకూడదట. మరి, యాలకులు ఎవరు తినకూడదో తెలుసుకుందాం..

PREV
16
Cardamom: యాలకులు వీరు మాత్రం తినకూడదు.. ఎందుకో తెలుసా?

యాలకులను ప్రతి ఇంట్లో కామన్ గా వాడుతూ ఉంటారు. వీటిని చాలా వంటకాల్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా టీ నుంచి స్వీట్ల వరకు.. బిర్యానీ నుంచి పులావ్ వరకు  ఈ యాలకులు వాడకుండా చేయరు. ఇవి లేకుండా.. వాటి రుచిని కూడా మనం ఊహించలేం. మంచి రుచిని అందించడంలోనే కాదు...అద్భుతమైన సువాసనను కూడా అందించడంలో ముందుంటుంది. కానీ.. ఈ యాలకులు అందరికీ మేలు చేయమని మీకు తెలుసా? వీటిని కొందరు అస్సలు తీసుకోకూడదట. మరి, ఈ యాలకులను ఎవరు తీసుకోకూడదు...? దీని వల్ల వారికి కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం...

 

26

యాలకుల్లో రెండు రకాలు ఉంటాయి. చిన్నవి ఆకు పచ్చ రంగులో ఉంటాయి. పెద్దవి నల్లగా ఉంటాయి. వీటిని వంటల్లో వేర్వేరు రుచుల కోసం వాడతారు. దాదాపు ఎక్కువగా ఈ చిన్న యాలకులనే వాడుతూ ఉంటారు.  చిన్న యాలకులను మౌత్ ఫ్రెషనర్‌గా, టీలో కలుపుకుని తాగుతారు. దీనిలో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు ఉన్నాయి.

36

గర్భిణీ స్త్రీలు యాలకులను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే... గర్భిణీ స్త్రీలు యాలకులు తినే ముందు  డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ ని సంప్రదించిన తర్వాతనే  వీటిని తీసుకోవాలి. వైద్యులను అడగకుండా యాలకులు తీసుకోవడం అంత మంచిది కాదు.

46

అంతేకాదు... కిడ్నీల్లో  రాళ్ల సమస్యలు ఉన్నవారు కూడా పొరపాటున కూడా యాలకులు తినకూడదు. ఎందుకంటే... యాలకులు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు మరింత పెద్దగా అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట.  అందుకే..ఈ సమస్య ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించకుండా యాలకులను తినడం మంచిది కాదు.

 

56

చర్మ సమస్యలు ఉన్నవాళ్లు యాలకులను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల చర్మంపై మచ్చలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఏవైనా స్కిన్ అలర్జీలు ఉన్నాయి అంటే తొందరపడి ఈ  యాలకులను తినకుండా ఉండటమే మంచిది.

66

దగ్గు సమస్య ఉన్నప్పుడు యాలకులను తినకూడదు. యాలకుల స్వభావం చల్లగా ఉండటం వల్ల దగ్గు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దగ్గు తగ్గిన తర్వాత కావాలంటే యాలకులను తీసుకోవచ్చు. యాలకులు తినడం వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉంటే, అంటే అలర్జీ ఉంటే, అలాంటి వాళ్లు యాలకులను తినకూడదు.

click me!

Recommended Stories