మిగిలిపోయిన చపాతీలను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 12, 2024, 9:50 AM IST

రాత్రిపూట చేసిన చపాతీలు ఉదయం, ఉదయం చేసిన చపాతీలు రాత్రివరకు మిగలడం చాలా కామన్. అయితే వీటిని చాలా మంది అలాగే తినేస్తుంటారు. కానీ ఇలా మిగిలిపోయిన చపాతీలను తింటే ఏమౌతుందో తెలుసా?

భారతదేశంలో చాలా మంది చపాతీలను లేదా జొన్న రొట్టెలను ఎక్కువగా తింటుంది. ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెల వాడకం తగ్గినా.. చపాతీలను మాత్రం ఉదయం బ్రేక్ ఫాస్ట్, నైట్ డిన్నర్ లో ఖచ్చితంగా తింటున్నారు. అయితే ఉదయం చేసిన మిగిలిపోయిన చపాతీలను ఫ్రిజ్ లో పెట్టేసి నైట్ టైం తింటుంటారు.అలాగే రాత్రి మిగిలిన చపాతీలను ఉదయం తింటుంటారు. 

చాలా మంది ఫుడ్ ను వేస్ట్ చేయరు. అందుకే మిగిలిపోయిన చపాతీలను ఫ్రిజ్ లో పెట్టేసి.. తర్వాతి పూటకు వేడి చేసి తింటుంటారు. అయితే ఇలా మిగిలిపోయిన చపాతీలను అసలు తినొచ్చా? తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిజానికి అప్పుడే చేసిన చపాతీల కంటే ఇలా మిగిలిపోయిన చపాతీలే ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. ఇలా మిగిలిపోయిన చపాతీలోని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మీరు రుచికరమైన కూరలతో వీటిని తినొచ్చు. మిగిలిపోయిన చపాతీలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే రకరకాల విటమిన్లు, ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. .

మిగిలిపోయిన చపాతీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

జీర్ణం:

మిగిలిపోయిన చపాతీలను ఫ్రిజ్ లో పెడితే అవి శీతలీకరణ ప్రక్రియ చెందుతాయి.ఇలాంటి వాటిని తినడం వల్ల బాగా జీర్ణమై కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. బలహీనమైన జీర్ణక్రియ లేదా అజీర్ణం సమస్యతో బాధపడేవారికి ఈ మిగిలిపోయిన చపాతీలు బాగా ఉపయోగపడతాయి. 


పోషక శోషణ:

మిగిలిపోయిన చపాతీల్లో ఐరన్, విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిగిలిపోయిన చపాతీల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సరళమైన రూపాల్లో విచ్ఛిన్నమవుతాయి. ఇవి మీ శరీరంలో పోషకాలను బాగా గ్రహించడానికి బాగా సహాయపడతాయి.

బరువు నిర్వహణ:

అప్పుడే చేసిన చపాతీల కంటే పాత చపాతీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు అప్పుడే చేసిన చపాతీల కంటే మిగిలిపోయిన చపాతీలను తినడం మంచిది. ఈ చపాతీలు మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.  

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

చపాతీ వయసు పెరిగే కొద్దీ ప్రీబయోటిక్స్ ఏర్పడటం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మరియు అంటువ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు ఇది చాలా ముఖ్యం.

బ్లడ్ షుగర్ మేనేజ్ మెంట్:

అప్పుడే చేసిన చపాతీల కంటే మిగిలిపోయిన చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది. అలాగే మీ  శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. 

మిగిలిపోయిన చపాతీలు తినడం వల్ల వచ్చే సమస్యలు

మిగిలిపోయిన చపాతీలను తినడం వల్ల ఒక్క లాభాలే కాదు నష్టాలు  కూడా ఉన్నాయి. అవును మిగిలిపోయిన చపాతీల్లో ప్రోటీన్లు, విటమిన్లు కొంచెం తక్కువగా ఉంటాయి.ఎందుకంటే చపాతీని ఎక్కువసేపు శీతలీకరించినట్టైతే దాంట్లో అచ్చు పెరుగుతుంది. అందుకే వీటిని ఎక్కువ సేపు ఉంచకుండా నిర్ణీత గడువులోగా తినేయాలి.  అలాగే మిగిలిపోయిన చపాతీలను సరిగ్గా నిల్వ చేయాలి. 

Latest Videos

click me!